
ఇక సీమాంధ్రపై కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టి
30న హిందూపురంలో రాహుల్ సభ.. మే 2న విశాఖలో సోనియా సభ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలు జరిగే తెలంగాణలో ప్రచారం ముగుస్తుండటంతో ఇక రెండోదశ ఎన్నికలు జరుగుతున్న సీమాంధ్ర ప్రాంతంపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించారు. సీమాంధ్రలో ఎన్నికల ప్రచారంకోసం ఏఐసీసీ పెద్దలతో సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు పాల్గొనేలా బహిరంగసభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 30న హిందూపురంలో జరిగే బహిరంగసభలో రాహుల్‌గాంధీ, మే 2న విశాఖపట్నంలో జరిగే బహిరంగసభలో సోనియాగాంధీ పాల్గొననున్నారు. వీరిద్దరితో సీమాంధ్ర ప్రాంతంలో మరికొన్ని సభలు ఏర్పాటు చేయాలన్న యోచనలోనూ ఏపీసీసీ నేతలున్నారు.