కేసీఆర్‌కు గట్టి పోటీ
1. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీచేస్తుండడంతో ఈ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2. కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడకేనని టీఆర్‌ఎస్ వర్గీయులు చెబుతున్నా పరిస్థితి అంత అనుకూలంగా లేదని విశ్లేషకుల అంచనా.
3. కేసీఆర్‌కు టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రధాన పోటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూవుుకుంట నర్సారెడ్డిపై పోటీచేసి ఓడి న ప్రతాప్‌రెడ్డికి మంచి క్యాడర్ ఉంది.
4. అప్పుడు ఓడిపోయినా ఆయన ప్రజల మధ్యే ఉండటం అదనపు బలం. ఈ కారణంగానే కేసీఆర్‌కు గట్టిపోటీ ఇస్తారని చెబుతున్నారు. స్థానికంగా సొంత బలమున్న ప్రతాపరెడ్డి ఏ స్థాయిలో ప్రభావం చూపుతారో వేచిచూడాల్సిందే. గట్టి పోటీ ఉన్నందునే ఇక్కడ హరీష్ కూడా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ వాదం బలంగా ఉన్న ఈ సమయంలో కేసీఆర్ తక్కువ మెజారిటీతో గెలిచినా.. ఓడిపోయనట్లే అవుతుందని రాజకీయ విశ్లేషకుల భావన. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున దొంతి పురుషోత్తంరెడ్డి బరిలో ఉన్నారు.