తమ్ముళ్లూ...గో బ్యాక్ | Kuppam People Protest to TDP Workers | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లూ...గో బ్యాక్

Published Sat, May 3 2014 2:44 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

తమ్ముళ్లూ...గో బ్యాక్ - Sakshi

తమ్ముళ్లూ...గో బ్యాక్

  • కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై తిరగబడుతున్న జనం  
  •  తాగునీరు ఇవ్వలేని బాబుకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీస్తున్న వైనం
  •  పగలు ట్యాంకర్లతో నీళ్లుతోలి సాయంత్రం ప్రచారానికి వెళ్తున్న టీడీపీ కార్యకర్తలు
  •  భయంతోనే ప్రచారం ముగింపుదశలోబాబు కుప్పం పర్యటన
  • సాక్షి, తిరుపతి : తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా ! .. అంటూ టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన గేయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రివర్సులో పాడుకునే పరిస్థితి తలెత్తింది. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న తెలుగు తమ్ముళ్లు జనం నుంచి ఎదురవుతున్న నిరసనలతో పారిపోతున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికల ప్రచారానికి               వెళ్లేందుకు కార్యకర్తలు జడుస్తున్నారు.

    ఈ సమస్యను అధిగమించేందుకు కుప్పం నేతలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పగలంతా ట్యాంకర్లతో గ్రామాలకు నీటిని తోలి సాయంత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమ్ముళ్లు ఏర్పాటు చేసిన ట్యాంకర్లు చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు నామినేషన్లు దాఖలు చేసిన తరువాత జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు ఇంతకంటే గత్యంతరం లేదని టీడీపీ కార్యకర్తలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.

    కుప్పం ప్రజల్లో చాలా చైతన్యం వచ్చిందని, ఎన్నికల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రం కావడంతో ప్రజల అవస్థలు అన్నీఇన్నీ కావు. వరుసగా చంద్రబాబును గెలిపిస్తున్నప్పటికీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయలేదన్న ఆగ్రహం కుప్పం ప్రజల్లో బలంగా నాటుకుంది. దీంతో ఎన్నికల వేళ చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారానికి వస్తున్న చోటా నేతలపై జనం ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో జనం నుంచి నిరసనలు, ఆగ్రహావేశాలు ఎదురవుతుండడంతో చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం ముగింపుదశలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఈ నెల నాలుగో తేదీన కుప్పంలో ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం.
     
    తాగునీటి సమస్యపై మండిపడుతున్న జనం
     
    తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో తాగునీటి సమస్యపై జనం మండిపడుతున్నారు. వరుసగా వచ్చిన స్థానిక ఎన్నికల్లో హామీలు గుప్పించిన స్థానిక నాయుకులు, సవుస్యలు పరిష్కరించకుండానే వుళ్లీ ఓట్ల కోసం రావడంతో వుహిళల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. కుప్పం పట్టణంలో పగటి పూట ప్రచారాలకు వెళ్లాలంటేనే టీడీపీ నాయుకులు సాహసించడం లేదు. పట్టణంలో ఎక్కడికెళ్లినా వుహిళలు ఖాళీ బిందెలు చూపుతూ, తాగేందుకు గుక్కెడు నీరు లేదు... ఓట్లు అడిగేందుకు వచ్చారా ? అంటూ నిలదీస్తున్నారు.

    ఈ అవవూనాలతో నాయుకులు ప్రచారాల నుంచి వెనుతిరుగుతున్నారు. గుడుపల్లె వుండలం గుండ్లసాగరం గ్రావూనికి కొంత చొరవ తీసుకుని వెళ్లిన టీడీపీ నాయుకులకు చేదు అనుభవం ఎదురైంది.  ఁపదేళ్లుగా ఏమి చేశారు.. తాగేందుకు గుక్కెడు నీళ్లు ఇవ్వడం మీ వల్ల కాలేదంరూ.టూ గుండ్లసాగరం మహిళలు కొట్టినంత పనిచేశారు. శాంతిపురం వుండలంలో ట్యాంకరుకు రూ.400ల చొప్పున వెచ్చించి నీటిని సరఫరా చేస్తున్నారు.

    కానీ, తవుకు ఓట్లు వేయురని తెలుసుకున్న కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేయుకపోవడంతో వుహిళలు టీడీపీ నాయుకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి సవుస్య కారణంగా టీడీపీకి నియోజకవర్గంలో భారీ ఎత్తున వ్యతిరేకత ఎదురవుతోంది. నియోజకవర్గ పరిధిలోని 89 పంచాయుతీలకుగాను 60చోట్ల టీడీపీకి చెందినవారే సర్పంచ్‌లుగా ఉన్నారు. ఈ పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడం గమనార్హం.
     
    అలంకారప్రాయంగా రక్షిత నీటి పథకాలు
     
    చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన తొమ్మిది సంవత్సరాల కాలంలో నాలుగు కోట్ల రూపాయలతో గ్రామాల్లో పెద్ద ఎత్తున రక్షిత నీటి పథకాలు ఏర్పాటు చేశారు. ప్రతిపక్షంలోకి వెళ్లిన తరువాత వాటిని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఈ పథకాలు అలంకారప్రాయంగా మారాయి. ఒక్కో పథకం 20 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించారు. ఇటువంటి పథకాలు సుమారు 200 వరకు ఉన్నాయి. వీటి నిర్మాణ లోపాలతో వందకు పైగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని నిర్వహణలోపాల కారణంగా నిరుపయోగంగా మారాయి. ఈ పథకాల కోసం ఎక్కడికక్కడ వేసిన బోర్లు కూడా ప్రస్తుతం మరమ్మతులకు చేరుకున్నాయి. తమ ఓట్లతో అందలం ఎక్కుతున్న చంద్రబాబు గుక్కెడు మంచినీటిని కూడా ఇవ్వలేకపోతుండటం కుప్పం ప్రజలు జీర్ణించుకోలేకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement