‘గూగుల్’తో నేతల జాతకాలు...
ఓటు వేసే ముందు మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేతల జాతకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ‘గూగుల్’లో గాలించండి. వారి వివరాలన్నీ క్షణాల్లోనే మీ కళ్ల ముందుంటాయి. భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘గూగుల్’ తన ఎన్నికల పోర్టల్‌లో ‘నో యువర్ కేండిడేట్స్’ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘గూగుల్.ఇన్/ఎలక్షన్స్’ పోర్టల్‌లో ‘నో యువర్ కేండిడేట్స్’ ద్వారా ఎన్నికల బరిలోనున్న అభ్యర్థులందరి వివరాలనూ క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. కేవలం ప్రచారార్భాటాన్నే నమ్ముకోకుండా, అభ్యర్థుల వివరాలను పూర్తిగా తెలుసుకుని ఓటర్లు మరింత విచక్షణతో తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఇది దోహదపడగలదని పరిశీలకులు భావిస్తున్నారు.