న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ 15 శాతం వరకు బీజేపీ వైపు మళ్లుతుందనే భయంతోనే ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని, ఉత్తరప్రదేశ్ తర్వాత బీజేపీకి ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు వస్తాయని జైట్లీ పార్టీ వెబ్సైట్లో పేర్కొన్నారు. మమత తెలివైన రాజకీయా నాయకురాలని, అయితే బెంగాల్ ప్రజలు ఆశించిన మార్పు రాలేదని తెలిపారు. బూత్ల ఆక్రమణ, అక్రమ వలసదారులను ప్రోత్సహించడమే మమత తీసుకొచ్చిన మార్పు అంటూ జైట్లీ ఎద్దేవా చేశారు.