కేసీఆర్‌ను అంటే ఊరుకోం: మందా జగన్నాథం | manda jagannadham takes on telangana congress leaders | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను అంటే ఊరుకోం: మందా జగన్నాథం

Published Tue, Mar 25 2014 4:01 PM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

కేసీఆర్‌ను అంటే ఊరుకోం: మందా జగన్నాథం - Sakshi

కేసీఆర్‌ను అంటే ఊరుకోం: మందా జగన్నాథం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. ఏనాడూ ఉద్యమాలు చేయనివాళ్లు ఇప్పుడు కేసీఆర్‌ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్పై పొన్నాల లక్ష్మయ్య చేసిన ఆరోపణలు పసలేనివని కొట్టిపారేశారు. కేసీఆర్‌ను అవమానపరిచే విధంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.

ముమ్మాటికి తెలంగాణ పట్ల కాంగ్రెస్ వంచనకు పాల్పడిందన్నారు. కాంగ్రెస్ జాప్యం వల్లనే వందలాది మంది తెలంగాణ విద్యార్ధులు ఆత్మహత్యచేసుకున్నారని విమర్శించారు. దళిత సీఎంపై అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందని మందా జగన్నాథం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement