బీజేపీతో టచ్‌లోకొచ్చిన హరికృష్ణ | Nandamuri harikrishna likely to join BJP? | Sakshi
Sakshi News home page

బీజేపీతో టచ్‌లోకొచ్చిన హరికృష్ణ

Published Fri, Apr 18 2014 12:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీతో టచ్‌లోకొచ్చిన హరికృష్ణ - Sakshi

బీజేపీతో టచ్‌లోకొచ్చిన హరికృష్ణ

హైదరాబాద్ : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనే నానుడి ఉంది. నందమూరి హరికృష్ణ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తండ్రి స్థాపించిన పార్టీలో టికెట్ దక్కకపోవటంతో నందమూరి హరికృష్ణ బీజేపీతో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరో సీమాంధ్ర కాంగ్రెస్ నేత కూడా ఇదే బాటలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. టీడీపీలో పొత్తు లేకుంటే బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన తనను ప్రజలు ఆదరిస్తారని హరికృష్ణ చెబుతున్నారు. మరోవైపు సీమాంధ్రలో టీడీపీ విడుదల చేసిన అయిదో జాబితాలో కూడా హరికృష్ణకు టికెట్ దక్కలేదు. దాంతో టీడీపీ అధిష్టానంపై అలకబూనిన ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు. కాగా ఇటీవలే హరికృష్ణ సోదరి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement