మోడీయే ప్రధాని: ప్రతిభా అద్వానీ
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టించటం ఖాయమని బీజేపీ అగ్రనేత అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ అభిప్రాయపడ్డారు. మార్పుకు సమయం ఆసన్నమైందని ఎన్నికల అనంతరం దేశ ప్రజలు దీన్ని నిరూపిస్తారని చెప్పారు.
ప్రధాని అభ్యర్థిగా మోడీని తెరపైకి తేవటంపై అద్వానీకి అభ్యంతరాలున్నా ఆయన కుమార్తె మాత్రం మోడీ వైపే మొగ్గు చూపారు. గురువారం ఢిల్లీ లోఢీ ఎస్టేట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 272కిపైగా సీట్లు వస్తాయన్నారు.