
మోడీకి పలాయనమే గతి: రాహుల్
గోపాల్‌గంజ్ (బీహార్)/కోల్‌కతా: నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శల దాడి ని మరింతగా పెంచారు. ‘మోడీకి తెలిసిందల్లా విభజన రాజకీయాలే. వాటి ఆటకట్టయిన రోజున ఆయన రంగం నుంచి పలాయనం చిత్తగిం చడం ఖాయం’ అన్నారు. గురువా రం గోపాల్‌గంజ్, కోల్‌కతాల్లో ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ ప్రసంగిం చారు. మోడీలో చాలా ద్వేషముం దని, ఆయన ప్రతి మాటలోనూ అది కనిపిస్తూనే ఉంటుందన్నారు.