జంపింగ్.. జపాంగ్.. | Parties during the election defections | Sakshi
Sakshi News home page

జంపింగ్.. జపాంగ్..

Published Wed, Mar 19 2014 4:54 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

జంపింగ్.. జపాంగ్.. - Sakshi

జంపింగ్.. జపాంగ్..

న ర్సంపేట, న్యూస్‌లైన్ : మునిసిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కప్పదాట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను తమవైపు తిప్పుకుని ఆధిపత్యం చెలాయించేందుకు ముఖ్యనేతలు ఆరాటపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా పార్టీల ఫిరాయింపులు, ప్రచారాలతో నర్సంపేట రాజకీయం వేడెక్కింది.
 
  వివరాల్లోకి వెళితే.. నర్సంపేట నియోజకవర్గానికి రాజకీయపరంగా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దొంతి వూధవరెడ్డి, తెలంగాణ  ప్రాంతంలోనే టీడీపీకి బలమైన నాయుకుడిగా చెలావుణి అవుతున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్  జిల్లా ఇన్‌చార్‌‌జగా కొనసాగుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిలు ఆయా పార్టీలకు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 
  అయితే మూడు ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకోవాలంటే ముందు గా పార్టీలో నాయకులు, కార్యకర్తలు అధికంగా ఉండాలనే ఉద్దేశంతో పోటాపోటీగా వారు ఎదుటిపార్టీలోని వారిని చేర్చుకుం టున్నారు. కాగా, ఇదే అదనుగా భావిస్తున్న జంప్ జిలానీలు.. తావుు పోటీ చేసేందుకు అనుకూలమైన స్థానాలను ముందుస్తుగా ఖరారు చేసుకుని పార్టీలు వూరుతున్నారు.  మొత్తం మీద నాయకుల కప్పదాట్లతో నర్సంపేటలో సందడి నెలకొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement