అనంతపురం: తాడిపత్రి ఎన్నికల అధికారిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అభ్యర్థి రమేష్‌రెడ్డి నామినేషన్‌ను అకారణంగా తిరస్కరించారని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల అధికారి వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల అధికారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.
తాడిపత్రిలోని 10, 18 వార్డులకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డి కౌన్సిలర్‌గా నామినేషన్ వేశారు. జేసీ సోదరులకు అత్యంత సన్నిహితంగా ఉన్న తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, మాజీ కౌన్సిలర్ రమేష్‌రెడ్డి ఐదు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీలోకి చేరి, చురుకైన పాత్ర పోషించి అన్ని వార్డులకూ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు.
దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి శనివారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా రమేష్‌రెడ్డి మునిసిపాలిటీకి బకాయిపడ్డారని లిఖిత పూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆరు గంటల హైడ్రామా అనంతరం రమేష్‌రెడ్డి నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరామకష్ణ ప్రకటించారు.
ఎన్నికల అధికారిపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
Published Mon, Mar 17 2014 12:42 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement