నకిరేకల్, న్యూస్‌లైన్ : నవ తెలంగాణ వికాసానికి సీపీఎం కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలో సోమవారం జరిగిన ఆ పార్టీ డివి జన్ కమిటీ సమావేశంలో ఆయ న మాట్లాడారు. నవ తెలంగాణ వికాసంలో సీపీఎం స్పష్టమైన ఎజెండాతో ముం దుకు సాగుతుందన్నారు. సామాజిక న్యాయంతో కొందరికి పదవులు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరగదన్నారు. వృత్తిదారులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి చే సినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటర్లను అనేక ప్రలోభాలకు గురితీసిందని ఆరోపించా రు. కాంగ్రెస్‌తో పాటు టీఆర్ ఎస్, బీజేపీలు సైతం విచ్చలవిడిగా మద్యం పారించి రాజకీయాలను కలుషితం చేశాయన్నారు. సీపీఎం నైతిక విలువల కోసం పోరాడుతుందన్నారు. ఆ పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు బోళ్ల నర్సిం హారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి ఎండీ జహంగీర్, నాయకు లు మేక అశోక్‌రెడ్డి, మామిడి సర్వయ్య, కందాల ప్రమీల, వంటెపాక వెంకటేశ్వర్లు, జీరాల పెం టయ్య, గాదగోని కొండయ్య, బొజ్జ చిన్నవెం కులు, అచ్చాలు, గడుసు వెంకట్‌రెడ్డి, నంద్యాల వెంకట్‌రెడ్డి, మర్రి వెంకటయ్య, చెరుకు పెద్దులు తదితరులు ఉన్నారు.
నవ తెలంగాణ వికాసానికి సిద్ధం
Published Tue, May 6 2014 2:22 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement
Advertisement