రాజన్న పథకాలను కొనసాగిస్తాం | Rajanna schemes will continue | Sakshi
Sakshi News home page

రాజన్న పథకాలను కొనసాగిస్తాం

Published Mon, Apr 21 2014 2:02 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Rajanna schemes will continue

సాటాపూర్(రెంజల్), న్యూస్‌లైన్:  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు. బోధన్ మండలం పెగడాపల్లి, బర్దీపూర్, బెల్లాల్, రెంజల్ మండలం సాటాపూర్, నీలా, కందకుర్తి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పింఛన్లను రూ. 700, రూ. 1000 లకు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పాలన అవి నీతిమయమైందన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రా న్ని ఏలిన పార్టీలు ప్రజలకు చేసింది శూన్యమన్నారు. పార్టీలు వేరైనా పాలన ఒక్కటేనని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను చెత్తబుట్టలో పడేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టుపట్టాయని, ప్రజల క్షేమాన్ని పాలకులు మర్చిపోయారని అన్నారు. వైఎస్‌ఆర్ తనయుడు వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన జగన్ అన్ని వర్గాల వారి కి చేయూతనందిస్తారని అన్నారు.

 రాజన్న అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందాయని, వాటిని యథావిధిగా అమలు పరిచేందుకోసం జగన్‌కు అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. కుమ్మక్కు రాజకీయాలు మానుకుని నీతివంతమైన రాజకీయాలకు అవకా శం కల్పించాలన్నారు.

 అధికారమే పరమావధిగా టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. అందుబాటు లో ఉండే నాయకులను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement