నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతోంది. శుక్రవారం సాయంత్రానికి ప్రచార పర్వానికి తెరపడుతుండటంతో ఇప్పటికే కొన్ని పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు శ్రీకారం చుట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నోట్ల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల ముందే నగదు పంపిణీ ప్రారంభించారు. నోట్లు పంపిణీ చేస్తే ఓట్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలపై నాయకులు ప్రధానంగా దృష్టిసారించారు. అస్తిత్వాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు, ఎలాగైనా విజయం సాధించకపోతే భవిష్యత్ ఉండదనే ఆందోళనతో టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బు అందజేసే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. కొన్నిచోట్లయితే ఓటరు స్లిప్‌తో పాటు కరెన్సీ నోట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం స్లిప్‌లను బీఎల్‌ఓలు పంపిణీ చేయాలి. ఈ ప్రక్రియలో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు. అయితే నేతలకు అనుకూలంగా ఉన్న కొందరు బీఎల్‌ఓలు వారికి పూర్తి సహకారం అందిస్తూ స్వామి భక్తి చాటుకుంటున్నట్లు ప్రచారం
జరుగుతోంది. చాలా చోట్ల శుక్ర, శనివారాల్లో నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. నెల్లూరులో ఓ నేత కుమారుడు పోటీ చేస్తున్న వార్డులో ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఓవైపు అధికారులు చెబుతున్నా, మరోవైపు నాయకులు తమ పని తాము చేసుకుని పోతున్నారు.
మద్యానికి స్లిప్‌లు
ఓ వైపు మున్సిపల్, మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండడంతో జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి మద్యం రవాణా చేసేందుకు సమస్యలు ఎదురవుతుండడంతో నాయకులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మద్యం వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారు. ఆ స్లిప్ తీసుకుని వెళ్లిన వారికి దుకాణంలో బాటిల్ అందజేస్తున్నారు.

పచ్చనోట్ల గలగల
Published Thu, Mar 27 2014 3:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement