కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోస్ట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటోన్న ఉద్యోగులకు జిల్లా కేంద్రంలోని బరిలో ఉన్న అభ్యర్థులు కాసుల వర్షం కురిపిస్తుండడంతో ఈ ఓట్ల జోరు పుంజుకుంటోంది. బుధవారం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 173ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో రోజు రోజుకు ఈసంఖ్య పెరుగుతుండడంతో ఇతర నియోజకవర్గాల్లోని ఉద్యోగులంతా అశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ఏ నియోజకవర్గాలు జిల్లా కేంద్రంతో పోటీ పడలేక రోజు వందలోపే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు నమోదు అవుతున్నాయి. ఇక మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు సంబంధించి 206, నాగర్‌కర్నూల్‌కు సంబంధించి 10 వంతున నమోదయ్యాయి.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో.......
కొడంగల్ 2, నారాయణపేట 9, మహబూబ్‌నగర్ 173, దేవరకద్ర 6, మక్తల్ 12, షాద్‌నగర్ 11, గద్వా ల 5, అలంపూర్ 5, నాగర్‌కర్నూల్ 69, అచ్చంపేట 5, కల్వకుర్తి 51, కొల్లాపూర్ 14 వంతున నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా 362పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాఖలు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16,237మంది ఉద్యోగులు తమ హక్కును వినియోగించుకొన్నారు. ఇక జడ్చర్ల, వనపర్తి నియోజకవర్గాల్లో ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా నమోదు కాలేదు. ఈనెల 15వరకు గడువు ఉండడంతో రోజు వారీగా కొంత మంది వంతున తమ హక్కును వినియోగించుకొంటున్నారు.
జోరందుకున్న పోస్టల్ బ్యాలెట్లు
Published Fri, May 9 2014 2:15 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM
Advertisement