స్వర్గంల కొడుకు ఆత్మ నిమ్మలం | Rest in peace for Martyrs of Nava telangana | Sakshi
Sakshi News home page

స్వర్గంల కొడుకు ఆత్మ నిమ్మలం

Published Sat, Apr 5 2014 1:15 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

స్వర్గంల కొడుకు ఆత్మ నిమ్మలం - Sakshi

స్వర్గంల కొడుకు ఆత్మ నిమ్మలం

అమ్మ మాట: ‘తల్లి తెలంగాణ’ కోసం తమకు కడుపు కోత మిగిల్చినా, వారు ఆశించిన తెలంగాణ వస్తే చాలంటున్నారు అమరవీరుల తల్లిదండ్రులు.  తెలంగాణ రాష్ట్రంలో సదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలివ్వాలంటున్నారు. పల్లెలు పచ్చగుండాలని, అన్ని వసతులున్న తెలంగాణను కోరుకుంటున్నారు. అప్పుడే నవ తెలంగాణ సాధ్యమని, తమ బిడ్డల ఆత్మ శాంతిస్తుందని చెబుతున్నారు.
 
 తెలంగాణ రాష్ట్రంలో నా కొడుకు లేకపోయె బిడ్డా. తెలంగాణ రావాలని భోజ్యా ఎప్పుడూ అంటుండే. తెలంగాణ అయితే ఉద్యోగాలు ఒత్తయ్ అవ్వా అనేటోడు. మంచి ఉద్యోగం చేసి బాగా సాదుత అనేటోడు. పార్టీలోళ్ల గడికోమాటకు నా కొడుకు బలైండు. వాడు కలగన్న తెలంగాణ వచ్చింది గని వాడు లేడాయె. గిప్పుడు నా భోజ్యా ఉండుంటే మంచిగుండు. ఏం జెత్త బిడ్డ. మా రాత గిట్లయిపాయె. నా కొడుకు అనుకున్న తెలంగాణ వచ్చినందుకు సంబురపడాల్నో, వాడు లేడని ఏడువాలో తెలుస్తలేదు. గిప్పుడు తెలంగాణ ఏర్పడింది. గి దీంతోని స్వర్గంలో ఉన్న నా కొడుకు పాణం నిమ్మలమైంది.
 
 చేతికి వచ్చే కొడుకు పోయిండు. మా బాధలు ఎట్లా తీరాలె బిడ్డా.  పిల్లల సావు.. అయ్యవ్వలకు చెప్పలేని గోస. అది ఎవలికి రావద్దు. తెలంగాణ అంటే మొదట్లో తెల్వకపోయేటిది. నా కొడుకు అన్నంకనే ఏందో తెలిసింది. వాడు పోయినంక ఇంకొంచెం ఎరుకైంది. నాయం జరుగాలంటే తెలంగాణ కావాలన్నారు. చానా మంది కొట్లాడిండ్లు. పాణాలు పోగొట్టొకున్నరు. ఇప్పుడు వచ్చింది. ఇప్పటికైన అందరు మంచిగుం డాలె. అందరి కడుపులు సల్లగుండాలె. రాజకీయాలు ఎమోగని తెలంగాణతో అందరు మంచిగుండాలె. పంటలు బాగా పండితే అందరికి తిండి ఉంటది. సదువుకుంటె కొలువులు రావాలె.
 
 - మంగ్తి, భోజ్యానాయక్ తల్లి, వీరారెడ్డి తండా గ్రామం,
 రఘునాథపల్లి మండలం, వరంగల్ జిల్లా
 సేకరణ: పల్ల రవి, రఘునాథపల్లి
 
 అడగండి చెబుతా..
 ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
 ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు..  కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై          సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి     - ఎలక్షన్ సెల్, సాక్షి,
 రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్,
 లేదా election@sakshi.com కు
 మెయిల్ చెయ్యండి.  
 
 మాది నల్లగొండ జిల్లా ఆలేరు. ఐదు నెలల క్రితం ఇల్లు మారాము. అడ్రస్ మార్పునకు జనవరి 1న దరఖాస్తు చేసుకున్నా. వెంటనే మార్చారు. అయితే, మా అమ్మగారి పేరు కూడా మార్చుకునేందుకు జనవరి 25న దరఖాస్తు చేశాను. కొత్త అడ్రస్‌కు ఆమె పేరు మారలేదు? ఇప్పుడు మేము ఏం చేయాలి.                                                                                                                                                                                      - రమేష్,నల్లగొండ


 ఏప్రిల్ 9వ తేదీలోపు మారుతుంది.
 ఏ అభ్యర్థీ నచ్చకపోతే తిరస్కరణ ఓటు ‘నోటా’ను ప్రవేశపెట్టారు. ఈ సౌకర్యం స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుందా? ఒక నియోజకవర్గంలో 50 శాతానికిపైగా ‘నోటా’ ఓట్లు నమోదైతే ఆ నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉంటుంది?
                 - సంధ్య, విజయనగరం
 స్థానిక ఎన్నికల్లో ‘నోటా’ సౌకర్యం లేదు. 50 శాతానికిపైగా ‘నోటా’ లోట్లు నమోదైనప్పటికీ, మిగతా అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలుస్తారు.
 నేను జర్నలిస్టును. పోలింగ్ రోజు మేం ఎన్నికల కవరేజ్‌లో ఉంటాం. మా గ్రామానికి వెళ్లి ఓటే సే వీలు ఉండదు. అందువల్ల జర్నలిస్టులకు కూడా  పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించవచ్చు కదా?
 -శ్రీహరి, నెల్లూరు
 ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ‘పోస్టల్ బ్యాలెట్’ సౌకర్యం ఉంది. మిగతా వారికి ఆ వెసులుబాటు ఉండదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement