తెలంగాణలో పొత్తుల అంశంపై కాంగ్రెస్-సీపీఐల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో పొత్తుల అంశంపై కాంగ్రెస్-సీపీఐల మధ్య చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సిపిఐ నేతల బృందం ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు. తాము పోటీ చేయదలచుకున్న స్థానాల వివరాలను సీపీఐ బృందం పొన్నాలకు అందజేసింది.
సిపిఐకి ఒక లోక్సభ స్థానం, 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో సీపీఐ నేతలు అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ ఢిల్లీలో మాట్లాడుతూ సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఉండాల్సిందేనన్నారు. టీఆర్ఎస్‌తో పొత్తు అధిష్టానం ఇష్టం అని ఆయన చెప్పారు. పోలవరం మండలాలను సీమాంధ్రలో కలపనీయం, ఒక్క గ్రామాన్ని కూడా సీమాంధ్రకు ఇవ్వం అని బలరాంనాయక్ స్పష్టం చేశారు.