కేసీఆర్ ఓటమినే సోనియాకు బహుమతినిస్తా | Sonia Congress defeat gift kcr loss | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఓటమినే సోనియాకు బహుమతినిస్తా

Published Sat, Apr 19 2014 2:48 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

కేసీఆర్ ఓటమినే సోనియాకు బహుమతినిస్తా - Sakshi

కేసీఆర్ ఓటమినే సోనియాకు బహుమతినిస్తా

సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి

 కొండాపూర్,  మాట తప్పిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఎలాగైనా ఆయన్ను ఓడించి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు నచ్చేది, మెచ్చేది కేసీఆర్ ఓటమి ఒక్కటేనన్నారు. మాయల మారాఠీ, గజదొంగలా వ్యవహరించే కేసీఆర్ మాటలను నమ్మవద్దన్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్ముకుంటారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్సులకు డీజిల్‌కే డబ్బుల కొరత ఉంటే హెలీకాప్టర్ల ద్వారా గ్రామాల్లోకి వైద్యులను పంపించి వైద్యం చేయిస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
 టీడీపీ భవిష్యత్తు అంధకారమే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement