సొంతపార్టీ నేతలకే సీఎం అపాయింట్‌మెంట్?
హైదరాబాద్: వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. వ్యవసాయ విభాగంలో ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థులు మంత్రులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని.. మాజీ విప్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నోటిఫికేషన్ విషయంలో మంత్రులు పోచారం, హరీష్‌రావులను కలిసిన విద్యార్థులకు సీఎం దృష్టికి తీసుకెళ్లమనడం ఆశ్ఛర్యకరం.
సొంత పార్టీ నేతలకే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ లభించడం లేదు. అలాంటిది విద్యార్థులకు ఎలా దొరకుతుంది. సుమారు 700 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోంది. దీనికి నిరసనగా రేపు విద్యార్థులతో కలిసి అసెంబ్లీ ముట్టడి చేసి సర్కార్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.