టీడీపీలో ముసలం
టీడీపీలో ముసలం
Published Wed, Apr 9 2014 12:50 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
సాక్షి, ఏలూరు : ‘అంతా అయిపోయింది.. పార్టీలో ముసలం పుట్టింది. చివరకు పార్టీ తుడిచిపెట్టుకుపోయేలా ఉం ది. ఇన్నాళ్లూ జనాన్ని మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ మట్టికొట్టుకుపోయాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మనమెంత అధ్వాన్న స్థితిలో ఉన్నామో జనానికి తెలిసిపోయింది. ఇప్పటివరకూ సైకి ల్ జోరు పెరిగిందంటూ గాలి ప్రచా రం చేసి నెట్టుకొచ్చేశాం. ఇదంతా గోబెల్స్ ప్రచారమేని ప్రజలు పసిగట్టేశారు. మన పార్టీ గతేంటి. మన భవిష్యత్ ఏంట’నే భయూందోళనలు తెలుగు తమ్ముళ్లను చుట్టుముడుతున్నాయి.
టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య ఎక్కడ చూసినా ఇలాంటి చర్చలే నడుస్తున్నాయి. ఎన్నికల తరుణంలో పార్టీ పరిస్థితిని తలచుకుని నాయకులు, కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. టీడీపీ అధినేత చం ద్రబాబు నిర్ణయం వల్ల జిల్లాలో టీడీపీ అతలాకుతలమవుతోంది. బీజేపీతో పొత్తు కార్చిచ్చులా మారి పార్టీనే దహించేలా తయారైంది. జనంలో లేని బలాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. తమ నాయకుడికి సీటు వస్తుందో లేదో తెలియక కొందరు.. వచ్చి నా గెలుస్తాడో లేదోననే అయోమయంలో మరికొందరు గుబులుతో అల్లాడుతున్నారు. ఇప్పటివరకూ పార్టీని భుజాలపై మోసిన తాము ఇటు పదవులు లేక, అటు ప్రజల్లో పరపతి కోల్పోయి రెంటికీ చెడ్డ రేవడిలా మారుతున్నామేమోననేయం వారికి పట్టుకుంది.
జనంలోకి వెళ్లేదెలా...
తలోతోకా లేని హామీలతో ప్రజల్లో రోజురోజుకు చులకనైపోతున్న పార్టీ స్థితిని తలుచుకుని తమ్ముళ్లు తలదిం చుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా పార్టీ అధినేత చేస్తున్న వంచన.. అవకాశవాదంపైనే ప్రజలు చర్చించుకోవటం చూసి బిక్కచచ్చిపోతున్నారు. ఆ పార్టీ కుటిల నీతిని ప్రజలు ఎండగడుతుం టే ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా గెల వలేమని తెలిసి ఇతర పార్టీల నాయకులకు గాలమేసి.. చివరకు వారికీ వెన్నుపోటు పొడిచిన టీడీపీ మరోసారి తన నైజాన్ని చాటుకుంది. ఎలాగైనా గద్దెనెక్కాలనే దుర్బుద్ధిని నరనరానా జీర్ణిం చుకున్న టీడీపీ పెద్దలు తొక్కని అడ్డదారులు లేవు. గత ఏడాది పంచాయ తీ, సహకార ఎన్నికల నుంచి తాజా మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో టీడీపీ చేసిన మోసాలను ప్రజలు కళ్లారా చూశారు. ఈ పరిస్థితుల్లో తమ పన్నాగాలు పారకపోవడంతో నేతలు బావురుమంటున్నారు. పార్టీ కోసం నాయకులు తమ ఆస్తులను పణంగా పెట్టారు.
ఓటర్లను మాయోపాయంతో ఏమార్చాలన్న పార్టీ అధినేత ఆదేశాలకు తలవంచారు. చివరకు వారి భవి ష్యత్‌ను అధినేత తుంచేస్తున్నారు. నిజానికి ప్రజల్లో తమ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉందని నాయకులకు తెలుసు. అయినా అధినేత చెప్పడంతో ఆ నిజాన్ని దాచే ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. జిల్లాలో ఉండీ లేనట్టున్న భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతో తెలుగుదేశానికి బలం లేదనే విషయాన్ని ఆ పార్టీ వారే ఒప్పుకున్నట్లయ్యింది. అలాగని బీజేపీ వల్ల లాభం చేకూరుతుందనుకోవడానికీ లేదు. జిల్లాలో బీజేపీకి కనీస బలం లేదు. అలాంటి పార్టీతో పొత్తు ఏంటంటూ కార్యకర్తలు నాయకులను నిలదీస్తున్నారు. ఇప్పటివరకూ పార్టీ తమకేమీ చేయకపోయినా పార్టీ కోసం కట్టుబడి పనిచేసిన తామిప్పుడు జనానికి మొహం ఎలా చూపించాలో తెలియడం లేదని వాపోతున్నారు. మునిగిపోయే పడవ అని తెలిసీ టీడీపీలో ఉన్నందుకు తమ భవిష్యత్‌ను సర్వనాశనం చేశారని దిగులు చెందుతున్నారు.
తప్పని తిరుగుబాట్లు!
ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో తిరుగుబాటు ముసలం పుడుతోంది. నమ్మిం చి గొంతు కోసిన అధినేత తీరును సహించలేక ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తమకు అంటిన మరకలను వది లించుకోవాలని అనుకుంటున్నారు. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని కార్యకర్తలు, నాయకుల్లో ఇదే భావన వ్యక్తమవుతోంది. పదవీ వ్యామోహాన్ని వదులుకోలేని కొందరు నాయకులు మాత్రం ఆ పార్టీ టిక్కెట్టు తెచ్చుకుని ఏదో రకంగా గద్దెనెక్కాలనుకుంటున్నారు. కానీ వారికీ ఓటమి భయం పట్టుకుంది. జిల్లాలో పార్టీ భ్రష్టుపట్టిపోతుండటంతో వారంతా దిక్కులు చూస్తున్నారు. ఏ దిక్కూలేని వాళ్లు తప్పనిసరై టీడీపీ లోనే కొనసాగుతున్నారు.
Advertisement
Advertisement