ఎన్నికలు జరిగిన 42 రో జుల తర్వాత ఫలితాలు వెలువడనుండడంతో జిల్లాలో అందరి దృష్టి వాటిపై పడింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఫలితాలు ఎలా ఉంటాయోన ని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాక్షి, నెల్లూరు: ఎన్నికలు జరిగిన 42 రో జుల తర్వాత ఫలితాలు వెలువడనుండడంతో జిల్లాలో అందరి దృష్టి వాటిపై ప డింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఫలితాలు ఎలా ఉంటాయోన ని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట మున్సిపాలిటీలు, నాయుడుపేట నగర పంచాయతీకి మార్చి 30న పోలింగ్ జరిగింది. సాధారణంగా పోలింగ్ జరిగిన రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరిగేది. ఈ సారి మాత్రం ఎన్నడూలేని విధంగా వరుసగా వివిధ ఎన్నికలు రా వడం, వాటి ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై చూపుతాయని కొం దరు కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన కోర్టు ఫలితాలను సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత మున్సిపల్ ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశించిన సంగతితెలిసిందే. ఈ క్రమంలో సోమవారం లెక్కింపు జరుగుతుండడంతో అభ్యర్థులతో పాటు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వాటి కోసం నిరీక్షిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల గెలుపోటములపై పందేలు కాసిన వారు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు వెలువడిన తెల్లారే(మంగళవారం) ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అందరి దృష్టి అధికారంపైనే
నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత 2005 సెప్టెంబర్‌లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పలువురు సుదీర్ఘకాలం పాటు పదవులు లేక రాజకీయ నిరుద్యోగులుగా మారారు. మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టడంపైనే అందరూ దృష్టి పెట్టారు.
గతంలో పదవులు అనుభవించిన వారితో పాటు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారు కూడా ఈ విషయంలో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మేజర్ పంచాయతీల నుంచి అప్‌గ్రేడ్ అయిన ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో తొలిసారిగా కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ల పీఠాలను అధిష్టించడాన్ని పలువురు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు నెల్లూరు నగరపాలక సంస్థకు నూతన భవనం నిర్మించినప్పటి నుంచి మేయర్ చాంబర్‌తో పాటు కార్పొరేషన్ సమావేశం మందిరంలోని కార్పొరేటర్ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజేతలై అధికారం చేపట్టాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ అదృష్టం ఎవరికి దక్కుతుందో మరో 24 గంటల్లో తేలిపోనుంది.