ఒంగోలు, న్యూస్‌లైన్: ప్రాదేశిక నియోజకవర్గాల బరిలో అభ్యర్థులు ఎవరో సోమవారం తేలనుంది. ఇప్పటి వరకు 56 జెడ్పీటీసీ స్థానాలకు 576 మంది నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 24 మంది నామినేషన్లు సరిగా లేవంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జేసీ యాకూబ్‌నాయక్ తిరస్కరించారు. అయితే వీటిలో 9 మంది అభ్యర్థులు తిరస్కరణను సవాల్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ్‌కుమార్‌కు అభ్యంతర పత్రం దాఖలు చేశారు. దానిని పరిశీలించిన కలెక్టర్ ఆదివారం తన నిర్ణయాన్ని వెలువరించారు. తనకు అందిన 9 పత్రాల్లో 8 నామినేషన్లు చెల్లవని స్పష్టం చేశారు.
అయితే దొనకొండ నుంచి పోటీచేసిన పీ.రామారావు అనే వ్యక్తి దాఖలు చేసిన అభ్యంతరాన్ని ఆయన అంగీకరించారు. చెల్లుబాటు అయ్యే నామినేషన్లలో ఆయన పేరును చేర్చాలని జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. దీంతో జెడ్పీటీసీ బరిలో ఉన్నవారి సంఖ్య 553కు చేరింది. పది మంది టీడీపీ అభ్యర్థులు, నలుగురు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో జెడ్పీటీసీ బరిలో ఉన్న వారి సంఖ్య 539కి చేరింది.
ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 5801. వీటిలో 196 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మిగిలిన నామినేషన్ల సంఖ్య 5605. వాటిలో నామినేషన్లు ఉపసంహరించుకున్నవారు 118 మంది. వీరిలో సీపీఐ-1, కాంగ్రెస్-2, వైఎస్సార్‌సీపీ-31, టీడీపీ-49, స్వతంత్రులు -35 మంది ఉన్నారు. ఈ 118 మందిని మినహాయిస్తే ఆదివారం సాయంత్రానికి మిగిలిన ఎంపీటీసీ అభ్యర్థుల సంఖ్య 5487.
సాయంత్రం 3 గంటల వరకే గడువు
నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం సాయంత్రం 3 గంటల వరకే గడువు అని జెడ్పీ సీఈవో ఏ.ప్రసాద్ తెలిపారు. ఆ తరువాత మిగిలిన అభ్యర్థులంతా బరిలో ఉన్నట్లే అన్నారు. అదే విధంగా ఇంత వరకు పార్టీల తరఫున ఎవరైనా బీఫారం దాఖలు చేయని అభ్యర్థులుంటే వారు సాయంత్రం 3 గంటలలోగా స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలన్నారు. లేని పక్షంలో పార్టీ గుర్తు కేటాయించరని చెప్పారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు నేడు
Published Mon, Mar 24 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
Advertisement
Advertisement