సాక్షి, హైదరాబాద్: అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న టీఆర్‌ఎస్.. తొలి జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించడం మేలని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ రెండు మూడు రోజులుగా గెలుపు గుర్రాల ఎంపికపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆయా జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులతో చర్చలు జరిపారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించి ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. 69 మందితో తొలి జాబితాను శుక్రవారం ప్రకటించే అవకాశముంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, పెద్దగా వివాదం లేని అభ్యర్థుల పేర్లను తొలుత ప్రకటించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఖరారైన పార్టీ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా: సిర్పూర్ - కావేటి సమ్మయ్య (సిట్టింగ్), చెన్నూరు(ఎస్సీ) - నల్లాల ఓదేలు(సిట్టింగ్), ఖానాపూర్ (ఎస్టీ) - రేఖ, ఆదిలాబాద్ - జోగి రామన్న (సిట్టింగ్), బోథ్ (ఎస్టీ) - రాములు నాయక్ (ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జి నగేష్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం), నిర్మల్ - శ్రీహరిరావు, ముధోల్ - వేణుగోపాలచారి (సిట్టింగ్). నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్- జీవన్‌రెడ్డి, బోధన్ - షకిల్, జుక్కల్( ఎస్సీ) - హనుమంతు షిండే (సిట్టింగ్), బాన్సువాడ - పోచారం శ్రీనివాసరెడ్డి (సిట్టింగ్), ఎల్లారెడ్డి - ఏనుగు రవీందర్‌రెడ్డి (సిట్టింగ్), కామారెడ్డి - గంపా గోవర్దన్ (సిట్టింగ్). కరీంనగర్ జిల్లా: కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (సిట్టింగ్), ధర్మపురి (ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్(సిట్టింగ్), రామగుండం - సోమారపు సత్యనారాయణ(సిట్టింగ్), మంథిని - పుట్ట మధు, పెద్దపల్లి - మనోహర్‌రెడ్డి, కరీంనగర్ - గంగుల కమలాకర్(సిట్టింగ్), వేములవాడ - చెన్నమనేని రమేష్(సిట్టింగ్), సిరిసిల్ల - కె రామారావు(సిట్టింగ్), మానకొండూరు (ఎస్సీ) - రసమయి బాలకిషన్ / ఆనంద్, హుజూరాబాద్ - ఈటెల రాజేందర్(సిట్టింగ్), హుస్నాబాద్ - వి.సతీష్. మెదక్ జిల్లా: సిద్దిపేట - హరీష్‌రావు(సిట్టింగ్), మెదక్ - పద్మా దేవేందర్‌రెడ్డి, ఆంధోల్ (ఎస్సీ) - ఎర్రోళ్ల శ్రీనివాస్ / బాబుమోహన్, దుబ్బాక - రామలింగారెడ్డి, గజ్వేల్ - కేసీఆర్. రంగారెడ్డి జిల్లా: మేడ్చల్ - సుధీర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి - ఆకుల రాజేందర్(సిట్టింగ్), ఉప్పల్ - పి. సుభాష్ రెడ్డి, మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి, చేవెల్ల(ఎస్సీ) - కెఎస్ రత్నం(సిట్టింగ్), పరిగి - కొప్పుల హరీశ్వర్‌రెడ్డి(సిట్టింగ్), వికారాబాద్ - పిడమర్తి రవి, తాండూర్ - పట్నం మహేందర్‌రెడ్డి(సిట్టింగ్). హైదరాబాద్ జిల్లా: ముషీరాబాద్ - నాయినీ నర్సింహ్మరెడ్డి/ ఆగిరి వెంకటేశం, అంబర్‌పేట - ఏ సుధాకర్‌రెడ్డి, సనత్‌నగర్ - దొంతు రామ్మోహన్/ దండే విఠల్, సికింద్రాబాద్ - పద్మారావు. మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ - శ్రీనివాసగౌడ్, జడ్చర్ల - లక్ష్మారెడ్డి, దేవరకద్ర - ఆల వెంకటేశ్వరరెడ్డి, మక్తల్ - ఎల్లారెడ్డి(సిట్టింగ్), వనపర్తి - నిరంజన్‌రెడ్డి, గద్వాల్ - కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ (ఎస్సీ) - మంద శ్రీనాథ్, నాగర్‌కర్నూల్ - మర్రి జనార్థన్‌రెడ్డి, అచ్చంపేట (ఎస్సీ) - గువ్వల బాలరాజు, కలృకుర్తి - జైపాల్‌యాదవ్(సిట్టింగ్), కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు(సిట్టింగ్). నల్లగొండ జిల్లా: సూర్యాపేట - జగదీశ్వర్‌రెడ్డి, ఆలేరు - జి సునీత. వరంగల్ జిల్లా: స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) - తాటికొండ రాజయ్య (సిట్టింగ్), పాలకుర్తి - సుధాకర్‌రావు, నర్సంపేట - పి సుదర్శన్‌రెడ్డి, పరకాల - భిక్షపతి (సిట్టింగ్), వరంగల్ వెస్ట్ - డి వినయ్‌భాస్కర్ (సిట్టింగ్), వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ, భూపాలపల్లి - మధుసుధనాచారి, ములుగు (ఎస్టీ) - చందులాల్. ఖమ్మం జిల్లా: కొత్తగూడెం - జలగం వెంకటరావు.