హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 4న తొలి జాబితాను విడుదల చేయనుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు ఉదయం 11 గంటలకు జాబితా ప్రకటించనున్నారు. 7 వ తేదీన అభ్యర్థులకు బీ ఫారాలను పంపిణీ చేయనున్నారు.
ఈ నెల 11న కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తు కుదుర్చు కోలేదు. తొలుత కాంగ్రెస్తో, ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశముందని వార్తలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు.
ఈ నెల 4న టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా
Published Wed, Apr 2 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM
Advertisement
Advertisement