
టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే దొరల పాలనే: షబ్బీర్ అలీ
దోమకొండ టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణలో తిరిగి దొరల పాలన వస్తుందని టీ-పీసీసీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్విహ ంచారు. కేసీఆర్‌కు కుటుంబసభ్యుల అభివృద్ధే ముఖ్యమని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు తానే సీఎం అంటున్నాడని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఓటు వేసి తెలంగాణ ప్రజలు రుణం తీర్చు కోవాలని అన్నారు.