ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా చాలు.
ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా చాలు. అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల విషయంలో అయితే రీకౌంటింగ్, ఇతర వ్యవహారాలు అన్నీ ఉంటాయి గానీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఓటు కూడా సరిపోతుంది. అలా ఒక్క ఓటుతో నెగ్గిన వీరుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆగర్రు ఎంపీటీసీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీచేసిన పొనుకుమట్ల వీరాస్వామి కేవలం ఒక ఓటుతో గెలిచారు.
పాలకొల్లు రూరల్-2 నుంచి ఎన్నికైన చిట్టూరి ఏడుకొండలు (కొండబాబు) కేవలం 5 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కొత్తపేట నుంచి పెచ్చెట్టి వెంకటలక్ష్మి కేవలం 15 ఓట్ల మెజార్టీతో, దగ్గులూరు నుంచి పోటీ చేసిన బుడితి కేశవరావు కేవలం 31 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. లంకలకోడేరు-1నుంచి పోటీ చేసిన చుండూరి త్రివేణి 46 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.