one vote majority
-
‘కృష్ణా’లో ఫలితం తేల్చిన ఒక్క ఓటు..
సాక్షి, అమరావతిబ్యూరో: కృష్ణా జిల్లాలోని అతిచిన్న పంచాయతీ అయిన నందివాడ మండలం గండేపూడి గ్రామ పంచాయతీకి శనివారం ఎన్నిక జరిగింది. అక్కడ బరిలో నిలిచిన సర్పంచి అభ్యర్థి ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ గ్రామ జనాభా 196 కాగా ఓటర్లు 150 మంది. సర్పంచి పదవి కోసం వైఎస్సార్సీపీ మద్దతుదారు కర్నాటిక సత్యనారాయణ, టీడీపీ బలపరచిన భీమవరపు పార్వతిలు పోటీ పడ్డారు. 150 ఓట్లలో 142 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సత్యనారాయణకు 71 ఓట్లు, పార్వతికి 70 ఓట్లు పోలవగా నోటాకు ఒక ఓటు వేశారు. దీంతో సత్యనారాయణ ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అతి తక్కువ ఓట్లున్న ఈ గ్రామ ఫలితమే జిల్లాలో తొలిసారిగా వెలువడింది. కాగా, తొలివిడతలో విజయవాడ డివిజన్లోకెల్లా చిన్న గ్రామమైన కంకిపాడు మండలం కందలంపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి బాయిరెడ్డి నాగరాజు ఒక్క ఓటుతోనే గెలుపొందారు. నాగరాజుకు 103, ప్రత్యర్థి సుబ్రహ్మణ్యంకు 102 ఓట్లు వచ్చాయి. దీంతో నాగరాజు ఒక్క ఓటు మెజార్టీతో సర్పంచి పదవి దక్కించుకున్నారు. (చదవండి: ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి) మూడో విడత ఏకగ్రీవాల జోరు -
ఒక్క ఓటుతో విజయం
పోటీ ఏదైనా విజయం సాధించాలనుకోవడం మానవ నైజం. అయితే, ఊహించినట్టుగా పోరు ఏకపక్షంగా సాగి ఓ వ్యక్తిని విజయం వరించిందంటే పెద్దగా విశేషమేముంటుంది. కానీ, చివరివరకు పోరాడి ఒక్క మార్కు/పరుగు/ఓటుతో గెలుపు బావుటా ఎగురవేస్తే ఆ కిక్కే వేరు. ఉత్కంఠ రేపే ఇలాంటి ఫలితాలు అటు జనాలకు, ఇటు పోటీలో ఉన్నవారికి చిరకాలం గుర్తుండిపోతాయి. ఇక ఓడిన వారికి అతి స్వల్ప తేడాతో పరాజయం పాలవడం జీవితకాలం గుర్తుండిపోతుంది. తెలంగాణలో సోమవారం జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా రెండు చోట్ల అలాంటి ఫలితాలే వచ్చాయి. సిద్దిపేట జిల్లా అల్మాజీపూర్, నర్మేట గ్రామాల్లో ఒక్క ఓటు తేడాతో వంగ మంజుల, అజీద్ సర్పంచ్‌లుగా గెలుపొందారు. సాక్షి, మిరుదొడ్డి /నంగునూరు (సిద్దిపేట): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్మాజీపూర్‌లో సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో వంగ మంజుల తన ప్రత్యర్థి బండారి పద్మపై ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని అల్మాజీపూర్ కొత్తగా పంచాయతీ హోదా పొందిన గ్రామం కావడం విశేషం. అలాగే నంగునూరు మండలం నర్మేట గ్రామంలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి అజీద్ ఒక్క ఓటు తేడాతో సమీప ప్రత్యర్థి శనిగరం బాబుపై గెలుపొందారు. తొలిసారి వెలువడిన ఫలితంలో 3 ఓట్ల తేడా రాగా.. రీకౌంటింగ్ నిర్వహించారు. రీకౌంటింగ్‌లో అజీద్ ఒక్క ఓటుతో విజయం సాధించారు. -
ఒక్క ఓటుతో గెలిచిన 'వీరుడు'
ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా చాలు. అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల విషయంలో అయితే రీకౌంటింగ్, ఇతర వ్యవహారాలు అన్నీ ఉంటాయి గానీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఓటు కూడా సరిపోతుంది. అలా ఒక్క ఓటుతో నెగ్గిన వీరుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆగర్రు ఎంపీటీసీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీచేసిన పొనుకుమట్ల వీరాస్వామి కేవలం ఒక ఓటుతో గెలిచారు. పాలకొల్లు రూరల్-2 నుంచి ఎన్నికైన చిట్టూరి ఏడుకొండలు (కొండబాబు) కేవలం 5 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కొత్తపేట నుంచి పెచ్చెట్టి వెంకటలక్ష్మి కేవలం 15 ఓట్ల మెజార్టీతో, దగ్గులూరు నుంచి పోటీ చేసిన బుడితి కేశవరావు కేవలం 31 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. లంకలకోడేరు-1నుంచి పోటీ చేసిన చుండూరి త్రివేణి 46 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.