సంక్షేమం జగన్‌కే సాధ్యం
ఉప్పలగుప్తం, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు అమలు జరగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు.
ఉప్పలగుప్తం మండలంలో స్థానిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న ఆయన వైఎస్సార్ సీపీ చేపట్టే సంక్షేమపథకాలను ప్రజలకు వివరించారు. పేదల బతుకులను దగ్గరనుంచి చూసిన జగన్‌మోహన్ రెడ్డి వారి కష్టాలను గట్టెక్కించే రోజులు త్వరలో రానున్నాయన్నారు.
సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసే రోజునే పెట్టే ఐదు సంతకాలు రాష్ట్ర స్ధితిగతులను మార్చేస్తాయని బాబూరావు ప్రజలకు వివరించారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి దంగేటి శ్రీరామకృష్ణమూర్తి (రాంబాబు)తరఫున మండలంలో బాబూరావు ప్రచారం చేశారు.
ఉప్పలగుప్తం, ఎన్.కొత్తపల్లిగ్రామాల్లో పర్యటించిన ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి మిండగుదిటి మోహన్, పార్టీ మండల కన్వీనర్ నిమ్మకాయల హనుమంత శ్రీనివాసరావు, యాత్ కన్వీనర్ నడింపల్లి వాసురాజు, పార్టీ నాయకులు జిన్నూరి వెంకటేశ్వరరావు, భద్రి బాజ్జి, మోటూరి సాయి, బొడ్డు నాగేశ్వరరావు, తొత్తరమూడి నరసింహరావు, పేరిచర్ల వరలక్ష్మి తదితరులు ఉన్నారు.