‘చే’జిక్కేది ఎవరికో..! | who will have grab the constituencies in contest of assembly elections ? | Sakshi
Sakshi News home page

‘చే’జిక్కేది ఎవరికో..!

Published Wed, Apr 16 2014 1:41 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

‘చే’జిక్కేది ఎవరికో..! - Sakshi

‘చే’జిక్కేది ఎవరికో..!

మంథనికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశానికి ప్రధానిని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, రాష్ట్ర శాసనసభకు స్పీకర్‌ను, ఓసారి మంత్రిని అందించిన ఘనత ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. కంచుకోటను నిర్మించుకున్న కాంగ్రెస్ అది పదిలంగానే ఉంటుందని భావిస్తుండగా, తెలంగాణ సెంటిమెంట్, బలహీన వర్గాల బలంతో టీఆర్‌ఎస్ బరిలో నిలిచింది. మరోసారి ఉనికిని చాటుకోవాలని తెలుగుదేశం తపిస్తోంది.
 
అసెంబ్లీ నియోజకవర్గం- 
మంథని: 

ఎవరెన్నిసార్లు గెలిచారు:
 కాంగ్రెస్ - 10, టీడీపీ -1, సోషలిస్టు పార్టీ-1
 ప్రస్తుత ఎమ్మెల్యే: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)
 రిజర్వేషన్: జనరల్
 నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం, ఉద్యమ స్ఫూర్తి, బీసీ, ఎస్సీ, సామాజిక ఓటర్లు అధికం. దట్టమైన అడవులు, నియోజకవర్గ పొడవునా గోదావరి ప్రవాహం
 ప్రస్తుతం బరిలో నిలిచింది: 9

 ప్రధాన అభ్యర్థులు వీరే..
 దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)
 పుట్ట మధు(టీఆర్‌ఎస్)
 కర్రు నాగయ్య (టీడీపీ)
 
  
  నే.. గెలిస్తే..
-     ఉపాధికి పెద్దపీట వేస్తా..
-     చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రయత్నిస్తా
-     మిగిలిపోయిన సాగు,తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తా
-     రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తా
-     బడుగు, బలహీన వర్గాలతో పాటు అందరికి మేలు చేసే ప్రణాళిక
 - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)
 
 -    కనీస సౌకర్యాలు కల్పిస్తా
-     65 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధిఐదేళ్లలో సాధిస్తా
-     సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి
-     ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా
-     తాగునీరు, విద్య, వైద్యం, రోడ్డు,  రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తా
-     అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తా
 పుట్ట మధు (టీఆర్‌ఎస్)
 
-     నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందిస్తా
-     మహదేవపూర్, కాటారం, మహాముత్తారం మండలాలను కలిపే రింగురోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తా
-     మంథనిలో మురికివాడల రూపురేఖల్ని మారుస్తా
-     పక్కా గృహాలు, పింఛన్లు, బీదవాడికి అవసరమైన సదుపాయాలను కల్పిస్తా
 - కర్రు నాగయ్య (టీడీపీ)

మోత్కూరి శ్రీనివాస్, మంథని: మంథని నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పన్నెండుసార్లు జరిగిన ఎన్నికల్లో పదిసార్లు కాంగ్రెస్ ఇక్కడ పాగా వేసింది. హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని నాలుగోసారి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పోటీలో నిలిచారు. ఆది నుంచి ఉన్న అగ్రవర్ణాల ఆధిపత్యానికి తెర దించి బీసీకార్డు, తెలంగాణ సెంటిమెంట్‌ను అనుకూలంగా మలుచుకునేందుకు టీఆర్‌ఎస్ కాపు సామాజిక వర్గానికి చెందిన పుట్ట మధును బరిలోకి దింపింది.
 
 ఇదే సామాజిక వర్గం నుంచి టీడీపీ సైతం కర్రు నాగయ్యను అభ్యర్థిగా దింపి రెండోసారి ఈ నియోజకవర్గంలో ఖాతా తెరిచేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ కోసం ఈ నియోజకవర్గానికి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు టీఆర్‌ఎస్ పార్టీకి సేవ చేసిన చందుపట్ల సునీల్ రెడ్డి టీఆర్‌ఎస్ చర్యతో భంగపడ్డారు. టీఆర్‌ఎస్ రెబల్‌గా ఎన్నికల్లో పోటీలో నిలిచారు.
 
 విపక్షాలకు ఈసారైనా చోటు దక్కేనా...
 1952లో సోషలిస్టు పార్టీ అభ్యర్థి గులుకోట శ్రీరాములు, 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చందుపట్ల రాంరెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీని ఓడించిన రికార్డు సాధించారు. మిగతా పది పర్యాయాల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించి మంథనిని కంచుకోటగా మలుచుకుంది. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ మంథని ఓటర్లు సినీ గ్లామర్‌ను లెక్కచేయకుండా కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. ఇపుడు ఇక్కడి ఓటర్లు మరోసారి ‘చేయి’ అందిస్తారా లేక విపక్షాలకు చోటు కల్పిస్తారా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉంది.
 
 అభ్యర్థులకు హ్యాట్రిక్ విజయాలే..
 మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే హ్యాట్రిక్ విజయాలు సొంతమవుతాయి. 1952 నుంచి 2009 వరకు 12సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, సోషలిస్టు పార్టీలకు చెరోసారి అవకాశం మినహాయిస్తే పి.వి.నరసింహారావు నాలుగుసార్లు (1957, 1962, 1967, 1972), దుద్దిళ్ల శ్రీపాదరావు మూడుసార్లు (1983, 1985, 1989) హ్యాట్రిక్ సాధించారు. 1999, 2004, 2009లో శ్రీధర్‌బాబు  వరుసగా మూడుసార్లు   గెలిచా రు. ఇలా ఓసారి అభ్యర్థి గెలిస్తే హ్యాట్రిక్ లేదా నాలుగుసార్లు గెలుపొందడం ఆనవాయితీగా వస్తోంది.  
 
 రసవత్తర పోరుకు రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గం సిద్ధమైంది. నిన్నమొన్నటి వరకు ఇక్కడ ద్విముఖ పోరు తప్పదన్న విశ్లేషకుల అంచనాలు తల్లకిందులై చతుర్ముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి పార్టీని  వదిలి కమలం  గూటికి చేరడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రెండుసార్లు మంత్రి పదవి
 చేపట్టిన కమతం రాంరెడ్డి బీజేపీ నుంచి, డిప్యూటీ స్పీకర్‌గా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా
 వ్యవహరించిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి, రుక్మారెడ్డి
 వైఎస్సార్‌సీపీ నుంచి,  టి.రామ్మోహన్‌రెడి ్డ కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో నిలవడంతో అందరి దృష్టి  ఇక్కడ కేంద్రీకృతమైంది.
 
 అసెంబ్లీ నియోజకవర్గం
 పరిగి:  ఎవరెన్నిసార్లు గెలిచారు:
 కాంగ్రెస్ - 6, టీడీపీ - 5, స్వతంత్రులు -2
 ప్రస్తుత ఎమ్మెల్యే: కొప్పుల హరీశ్వర్‌రెడ్డి,
 (టీడీపీలో గెలిచారు, ప్రస్తుతం టీఆర్‌ఎస్)
 రిజర్వేషన్: జనరల్
 నియోజకవర్గ ప్రత్యేకతలు:
 బీసీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లు అధికం,
 25 సంవత్సరాలుగా టీడీపీకి కంచుకోట
 ప్రస్తుతం బరిలో నిలిచింది: 9
 ప్రధాన అభ్యర్థులు వీరే..
 రుక్మారెడ్డి (వైఎస్సార్‌సీపీ)
 కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్)
 కమతం రాంరెడ్డి (బీజేపీ)
 టీ.రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్)

నే.. గెలిస్తే..
 -    వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇంటింటికీ తీసుకు వెళ్తా.
 - అన్ని గ్రామాలకు రోడ్లు వేయించి రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తా.
 -    . రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటా.
 -     బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటా.
-    జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టో అమలుచేస్తా.
 - రుక్మారెడ్డి (వైఎస్సార్‌సీపీ)
 
-    పరిగిలో పాలిటె క్నిక్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తా
-   అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తా
-    {పతి తండాకు రోడ్డు వేయిస్తా
-    వ్యవసాయాభివృద్ధికి పాటుపడతా
-   రైతులకు మద్దతు ధర కల్పిస్తా
- కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్)
 
-   2009లో నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
-  కాలేజీలు స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేస్తా
- సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేలా చూస్తా
- తాగునీటి సమస్యను పరిష్కరిస్తా
-పరిగిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తా
- ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
 - కమతం రాంరెడ్డి( బీజేపీ)
 
-  పాలమూరు ఎత్తిపోతల పథకాన్నిసాధించేందుకు కృషి చేస్తా
- కోయిల్ సాగర్ నుంచి సురక్షిత తాగునీటిని ప్రజలకు అందిస్తా
-  ఫ్లోరైడ్ సమస్యను పారదోలుతా
-  యువతకు  ఉపాధి అవకాశాలు పెంచుతా
-    డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయిస్తా
 - టీ.రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్)
 
  నాటి పీఏ.. నేడు ప్రత్యర్థి
 ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయూకర్‌రావుకు వ్యక్తిగత సహాయుకుడిగా పనిచేసిన బండి కువూరస్వామి ఇప్పుడు ఏకంగా ఆయునపైనే పోటీచేస్తున్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 14 వుంది పోటీలో ఉండగా, అందులో ఎర్రబెల్లి పీఏ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009లో వర్ధన్నపేట సీటు ఎస్సీ కేటగిరికి రిజర్వు అయ్యింది.
 
 ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీకి ఎర్రబెల్లి తనకు టిక్కెట్ ఇప్పించలేదనే కోపంతోనే ఇప్పుడు కువూరస్వామి పోటీకి కారణవుని చెబుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం బురహాన్‌పల్లి ఆయున స్వగ్రావుం. టీ-టీడీపీ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి, టీఆర్‌ఎస్ అభ్యర్థి వూజీ ఎమ్మెల్యే ఎన్.సుధాకర్‌రావు,  కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావుల వుధ్య ప్రధాన పోటీజరగనుంది. టీడీపీ రెబెల్‌గా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు పోటీలో ఉన్నారు.    
 - వరంగల్, సాక్షి, ప్రతినిధి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement