ఫ్యాన్ జోరు.. తమ్ముళ్ల బేజారు | ysrcp josh in elections | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ జోరు.. తమ్ముళ్ల బేజారు

Published Sat, Mar 29 2014 12:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

ఫ్యాన్ జోరు.. తమ్ముళ్ల బేజారు - Sakshi

ఫ్యాన్ జోరు.. తమ్ముళ్ల బేజారు

భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : భీమవరం మునిసిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బాగా వీస్తోంది. ఏ వార్డులో చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురు లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుండగా టీడీపీ అభ్యర్థుల్లో నిస్సత్తువ ఆవహించింది. ఏం చేస్తాం.. పోటీలోకి దిగాం కదా.. తప్పదు.. అనుకుంటూ నీరసంగా ప్రచారాన్ని నిర్వహించారు.
 
మునిసిపాలిటీలో వరుసగా రెండుసార్లు టీడీపీనే గెలిపిస్తున్నామని, అయితే అభివృద్ధి చేయడంలో వారు విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు.  వైసీపీని గెలిపించుకుంటే పట్టణం అభివృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఒక పక్క అన్ని వార్డుల్లోనూ సుడిగాలి ప్రచారం చేయడంతో ట్రెండ్ పూర్తిగా మారిపోరుుంది.
 
ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే అంజిబాబును టీడీపీలోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి. మొన్నటి వరకు ఎవరితో అయితే పోరాడామో.. ఇప్పుడు ఆ నేతతో సర్దుకుపోయి పనిచేయడం తమ వల్ల కాదంటూ ఆ పార్టీ శ్రేణులు సహాయనిరాకరణ చేస్తున్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు విజయావకాశాలపై ఆశలు వదులుకున్నారు.
 
టీడీపీ అభ్యర్థులను ఏదోవిధంగా గెలిపించుకోవాలని భావించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మెంటే పార్థసారధి మారిన పరిస్థితుల నేపథ్యంలో అంత ఉత్సాహం చూపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ కండువా వేసుకోవడంపై పార్థసారధి ఆయన కినుక వహించారు. అసెంబ్లీ టిక్కెట్ అంజిబాబుకే ఖరారైన నేపథ్యంలో ఆయన మండిపడుతున్నారు. ఈ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారడంతో ఆ పార్టీ విజయం ఖయమని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement