మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీదే ఆధిక్యం | highest win tdp in muncipal elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీదే ఆధిక్యం

Published Tue, May 13 2014 3:38 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీదే ఆధిక్యం - Sakshi

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీదే ఆధిక్యం

- సంస్థాగత నిర్మాణం లేకున్నా టీడీపీకి గట్టిపోటీ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ
- అనంతపురం కార్పొరేషన్‌తో పాటు తొమ్మిది మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఆధిక్యం చాటుకున్న టీడీపీ
- గుత్తి నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి మెజార్టీ వార్డులు
- టీడీపీ కంచుకోట హిందూపురంలో ఆ పార్టీకి మేజిక్  ఫిగర్ దక్కని వైనం
 
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికలకు ముందు అనుకోకుండా వచ్చిపడిన మున్సిపల్ ఎన్నికల్లో సంస్థాగత నిర్మాణం లేకున్నా టీడీపీకి వైఎస్సార్‌సీపీ గట్టిపోటీ ఇచ్చింది. టీడీపీ కంచుకోటగా భావిస్తోన్న హిందూపురం మున్సిపాలిటీలో ఆ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కలేదు. ఇక్కడ టీడీపీకి వైఎస్సార్‌సీపీ గట్టిపోటీ ఇచ్చింది. కదిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆ పార్టీ రెబల్ అభ్యర్థులు అడ్డుకున్నారు. అనంతపురం కార్పొరేషన్‌తోపాటు తొమ్మిది మున్సిపాల్టీల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి.

అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. అనంతపురం కార్పొరేషన్, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్, కదిరి, ధర్మవరం మున్సిపాలిటీలు, కళ్యాణదుర్గం, మడకశిర, పామిడి నగర పంచాయతీల్లో మెజార్టీ వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. గుత్తి మునిసిపాలిటీలో సింహభాగం వార్డులను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. వైఎస్సార్‌సీపీ గట్టిపోటీ ఇవ్వడంతో హిందూపురంలో టీడీపీ మేజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది.

 
- కదిరి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ.. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టీడీపీకి గట్టిపోటీ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ టికెట్ దక్కక బరిలోకి దిగిన రెబల్స్ 14 వార్డుల్లో ఆ పార్టీ అధికారిక అభ్యర్థులను ఓడించారు. ఆ మేరకు టీడీపీ లబ్ధి పొందింది. వైఎస్సార్‌సీపీ రెబల్ అభ్యర్థులు బరిలో లేకపోతే కదిరి మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు.
- హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయలేదు. అయినా.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో వైఎస్సార్‌సీపీ నువ్వానేనా అన్నట్లుగా తలపడింది. మొత్తం 38 వార్డులకుగానూ.. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే 20 వార్డులు చేజిక్కించుకోవాలి. కానీ.. టీడీపీ 19 వార్డులకే పరిమితమై.. మేజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది.
- తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, గుంతకల్ మున్సిపాలిటీల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యం సాధించిది. ఆ నాలుగు మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలు టీడీపీ ఖాతాలో చేరనున్నాయి.
 - మడకశిర, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, పామిడి నగర పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ మెజార్టీ సాధించింది. ఆ పంచాయతీల ఛైర్మన్ పదవులు కూడా ఆ పార్టీ ఖాతాలోనే చేరనున్నాయి.
- గుత్తి నగర పంచాయతీలో 24 వార్డులకుగాను 11 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొంది.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది.
చైర్మన్ పీఠం చేజిక్కించుకోవాలంటే మరో రెండు వార్డుల సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటించారు.
- అనంతపురం కార్పొరేషన్‌లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకుంది. మొత్తం 32 డివిజన్‌లను చేజిక్కించుకుని.. మేయర్ పదవిని ఆపార్టీ ఖాతాలో వేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement