MLA Anjibabu
-
కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదు
భీమవరం : టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు రావడం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ఆవేదన వ్యక్తం చేశారు. రాయలంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాగిడి ముత్యాలరావు అధ్యక్షతన టీడీపీ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే అంజిబాబు హాజరవగా గాదిరాజు బాబు మాట్లాడుతూ రాత్రింబవళ్లు పార్టీలో కష్టపడి పనిచేసిన గుర్తింపు రావడం లేదని, పార్టీ అధినేత చంద్రబాబు కష్టపడిన వారిని గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించాల్సిన భాద్యత పార్టీ అధిష్టానంపై ఉందన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) మాట్లాడుతూ కార్యకర్తల అండతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కార్యచరణ రూపొందిస్తామన్నారు. సీనియర్ నాయకుడు మెంటే పార్థసారధి, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు గ్రంధి శ్రీనాథ్, సర్పంచ్ రామచంద్రరావు, పేరిచర్ల శివరామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు -
ఫ్యాన్ జోరు.. తమ్ముళ్ల బేజారు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : భీమవరం మునిసిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బాగా వీస్తోంది. ఏ వార్డులో చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎదురు లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుండగా టీడీపీ అభ్యర్థుల్లో నిస్సత్తువ ఆవహించింది. ఏం చేస్తాం.. పోటీలోకి దిగాం కదా.. తప్పదు.. అనుకుంటూ నీరసంగా ప్రచారాన్ని నిర్వహించారు. మునిసిపాలిటీలో వరుసగా రెండుసార్లు టీడీపీనే గెలిపిస్తున్నామని, అయితే అభివృద్ధి చేయడంలో వారు విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. వైసీపీని గెలిపించుకుంటే పట్టణం అభివృద్ధి చెందుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఒక పక్క అన్ని వార్డుల్లోనూ సుడిగాలి ప్రచారం చేయడంతో ట్రెండ్ పూర్తిగా మారిపోరుుంది. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే అంజిబాబును టీడీపీలోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యాయి. మొన్నటి వరకు ఎవరితో అయితే పోరాడామో.. ఇప్పుడు ఆ నేతతో సర్దుకుపోయి పనిచేయడం తమ వల్ల కాదంటూ ఆ పార్టీ శ్రేణులు సహాయనిరాకరణ చేస్తున్నాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు విజయావకాశాలపై ఆశలు వదులుకున్నారు. టీడీపీ అభ్యర్థులను ఏదోవిధంగా గెలిపించుకోవాలని భావించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మెంటే పార్థసారధి మారిన పరిస్థితుల నేపథ్యంలో అంత ఉత్సాహం చూపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ కండువా వేసుకోవడంపై పార్థసారధి ఆయన కినుక వహించారు. అసెంబ్లీ టిక్కెట్ అంజిబాబుకే ఖరారైన నేపథ్యంలో ఆయన మండిపడుతున్నారు. ఈ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారడంతో ఆ పార్టీ విజయం ఖయమని చెబుతున్నారు.