ఒంగోలు, న్యూస్‌లైన్: త్వరలో జరగబోతున్న జిల్లా పరిషత్ ఎన్నికలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. గతంలో కంటే భిన్నంగా రాష్ర్టపతి పాలన సమయంలో ఈ ఎన్నికలు జరగనుండటమే దీనికి కారణం. రాష్ట్ర అధికార పీఠంలో ఉన్న పార్టీనే ఇప్పటి వరకు జెడ్పీ ైచె ర్మన్ పదవిని సొంతం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ దఫా ఆ పదివి ఎవరిని వరించనుందో అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
మిగిలేది చరిత్రేనా?
అప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీకి 1983లో టీటీపీ బ్రేకులు వేసింది. మళ్లీ 18 ఏళ్ల తర్వాత గానీ జిల్లా పరిషత్ పీఠాన్ని కాంగ్రెస్ కాపాడుకోగలిగింది. కానీ ప్రస్తుతం ఆ రెండు పార్టీలపై ఓటర్లు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. సొసైటీ ఎన్నికలు.. పంచాయతీ ఎన్నికల నుంచి దోస్తులుగా మారిన ఆ పార్టీలు ఒక్కటై రాష్ట్రాన్ని విభజించాయని ప్రజలు నమ్ముతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రస్తుతం టీడీపీ పంచన చేరడంతో.. ఆ పార్టీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు.
మరో వైపు గడిచిన స్థానిక సంస్థల ఎన్నిల నుంచి పట్టు సాధిస్తున్న నూతన పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మరో సారి జెడ్పీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పార్టీ మొట్టమొదటి సారిగా ఓ బీసీ నేతను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయడాన్ని అంతా స్వాగతించారు.
వైఎస్‌ఆర్‌సీపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు వెనుకంజలోనే ఉన్నాయని చెప్పక త ప్పదు. ఈ నేపథ్యంలో జరగనున్న మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలనూ నిర్దేశిస్తాయంటున్న వాదనలు వినిపిస్తున్నాయి.
‘జెడ్పీ’ ప్రత్యేకం
Published Sun, Mar 23 2014 1:53 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement