
కడుపు తీపి అంటారందుకే!
అన్ని బంధాల కంటే పేగు బంధమే బలమైనదంటారు. అందుకే నేమో... బిడ్డ తనది కాకపోయినా, తన కడుపున మోసినందుకు గుండెకు హత్తుకుందా తల్లి. బ్రిటన్‌కు చెందిన క్రిస్టల్ కెల్లీ (32)కి పెళ్లై పిల్లలు ఉన్నారు.
అన్ని బంధాల కంటే పేగు బంధమే బలమైనదంటారు. అందుకే నేమో... బిడ్డ తనది కాకపోయినా, తన కడుపున మోసినందుకు గుండెకు హత్తుకుందా తల్లి. బ్రిటన్‌కు చెందిన క్రిస్టల్ కెల్లీ (32)కి పెళ్లై పిల్లలు ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తన గర్భాన్ని అద్దెకిచ్చేందుకు సిద్ధపడింది. పిల్లలు లేని ఓ దంపతుల కోసం సరొగేట్ మదర్‌గా మారింది. కవలలకు జన్మ నిచ్చింది. అయితే ఇద్దరు పాపల్లో ఒక పాపకి నరాల వ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దాంతో తల్లిదండ్రులు ఆ పాపను వదిలేసి, ఆరో గ్యంగా ఉన్న పాపను తీసుకుని వెళ్లిపోయారు. పాపను తీసుకెళ్లమని కబురు పెట్టినా... తమకు అక్కర్లేదని చెప్పేశారు. కానీ కెల్లీ అలా చేయలేకపోయింది. కడుపున మోసినందుకో ఏమో... మమతను చంపుకోలేకపోయింది. అనారోగ్యంగా ఉన్న బిడ్డను తీసుకెళ్లి పెంచుకుంటోంది. అమ్మ అనే పదానికి అసలైన అర్థాన్ని చెప్తోంది!