బాదం... ఎముకలకు పటుత్వం | Alteration of almond bones | Sakshi
Sakshi News home page

బాదం... ఎముకలకు పటుత్వం

Published Thu, Nov 2 2017 12:55 AM | Last Updated on Thu, Nov 2 2017 12:55 AM

 Alteration of almond bones - Sakshi

బాదం పప్పులో విటమిన్‌ ‘ఇ’, కాపర్, మెగ్నీషియం, ప్రోటీన్లు ఉంటాయి. బాదం గింజలలోని బయో యాక్టివ్‌ మాలిక్యూల్స్‌ (పీచు, ఫైటోస్టెరోల్స్, విటమిన్‌లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు)  గుండె సంబంధ వ్యాధులను నివారిస్తాయి.బాదంలోని రిబోఫ్లేవిన్, ఎల్‌– కామిటైన్‌లు మెదడుకు పోషకాలు. ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. వార్ధక్యంలో ఎదురయ్యే అల్జీమర్స్‌ వ్యాధిని నివారిస్తాయి ∙బాదం గింజలలోని సూక్ష్మ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నరాలను శక్తిమంతం చేస్తాయి. రక్తాన్ని వృద్ధి చేస్తాయి. దంతాలు, ఎముకలను గట్టిపరుస్తాయి. కాబట్టి ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముకల వ్యాధులను నివారించవచ్చు.

చర్మం కాంతివంతమవుతుంది ∙పిల్లలకు రోజూ రెండు లేదా మూడు బాదం గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినిపిస్తే మంచిది ∙బాదం తింటే దేహంలో కొవ్వు స్థాయులు పెరుగుతాయనే అపోహ చాలా బలంగా ఉంది. కానీ నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. ఇందులోని ఫ్యాటీ యాసిడ్‌ల వల్ల దేహ నిర్మాణానికి, జీవక్రియలకు అవసరమైన కొవ్వు సమృద్ధిగా లభిస్తుంది. ఇవి దేహంలోని కొలెస్ట్రాల్‌ స్థాయులను సమన్వయం చేస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement