ఏప్రిల్ 1... కొన్ని విషయాలు
సందర్భం
ఫ్రాన్సులో ఏప్రిల్ 1ని ‘పాయిజన్ డెవిల్’ అని కూడా పిలుస్తారు.
స్కాట్‌లాండ్‌లో ‘ఏప్రిల్ ఫూల్ డే’ను రెండు రోజుల పాటు జరుపుకొంటారు. రెండో రోజును ‘టైలీ డే’ అని పిలుస్తారు.
‘ఏప్రిల్ జెంటిల్‌మెన్’ అనే పదబంధాన్ని మూర్ఖులైన పురుషులను ఉద్దేశించి వాడతారు.
ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియంలలో ‘ఏప్రిల్ ఫూల్’ను ‘ఏప్రిల్ ఫిష్’ అని పిలుస్తారు.
స్కాట్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు ‘నెంబర్‌వన్ ఫూల్’ పోటీలు జరుగుతాయి. మిగిలిన వాళ్లతో పోల్చితే బాగా ‘ఫూల్’ అయ్యే వ్యక్తికి ‘నెంబర్‌వన్ ఫూల్’ టైటిల్‌ను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటిస్తారు.
నవ్వుల రోజైన ‘ఏప్రిల్ ఫూల్ డే’ పేరుతో బ్రైస్ అనే ఆస్ట్రేలియన్ రచయిత ట్రాజెడీ నవల రాశాడు. ఏప్రిల్ 1 న చనిపోయిన తన కొడుకు స్మృతిలో ఈ నవల రాశాడు.
1917 ఏప్రిల్1 రష్యాలో రాక్షసబల్లులకు చెందిన ఒక భారీ శిలాజాన్ని కనుగొన్నారు. దానికి ‘దమ్‌స్ తెరియన్ దా ఆనవియన్ రగి’ అని పేరు పెట్టారు.
ఒక్కక్షణం... పైన చెప్పిన రాక్షసబల్లి కథ నమ్మారా? హీ...హీ..హీ... ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ అండీ బాబూ!