
చర్చిల్ దొరగారి వింతభయం
ఇరవయ్యో శతాబ్దిలో ప్రపంచంలోనే పేరెన్నిక గల వక్తల్లో ఒకరిగా అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ దొరగారికి గొప్ప పేరుప్రఖ్యాతులు ఉండేవి.
ఇరవయ్యో శతాబ్దిలో ప్రపంచంలోనే పేరెన్నిక గల వక్తల్లో ఒకరిగా అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ దొరగారికి గొప్ప పేరుప్రఖ్యాతులు ఉండేవి. చరిత్రలోని గొప్ప వక్తల్లో ఒకరిగా చర్చిల్ పేరును ఇప్పటికీ చాలామంది ప్రస్తావిస్తారు. వక్తృత్వంలో అంతటి పేరు ప్రఖ్యాతులున్న చర్చిల్ దొరగారికి ఒక వింతభయం ఉండేది. అదేమిటో తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే! బహిరంగ వేదికలపై ప్రసంగించాలంటే చర్చిల్ దొరగారికి చచ్చేంత భయంగా ఉండేదట.
చర్చిల్ దొరగారు తన 29వ ఏట బ్రిటన్ ప్రతినిధుల సభలో ఒకసారి ప్రసంగించడానికి ప్రయత్నించారు. సభాపతి అనుమతించగానే, మాట్లాడటానికి లేచి నిల్చున్నా, నోట మాట పెగల్లేదు. మూడు నిమిషాలు అలాగే గడిచిపోయాయి. సిగ్గుతో ముఖాన్ని చేతుల్లో కప్పుకుని, అలాగే తన స్థానంలో కూర్చుండిపోయాడు. జీవితంలో ఇంకెప్పుడూ తనకు ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని తీర్మానించుకున్నాడు. కఠిన సాధన చేసి, క్రమంగా తన వాగ్ధాటితోనే ప్రపంచంలో పేరుప్రఖ్యాతులు పొందాడు.
కూర్పు: పన్యాల జగన్నాథదాసు