‘కరోనా పేషంట్స్‌ను ట్రీట్ చేస్తున్న మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు.. ఇక్కడ ఉండకూడదు’అంటూ డాక్టర్లు, నర్స్‌లను ఇళ్లు ఖాళీ చేయిస్తున్న మనుషులున్న చోటే.. ‘మీరందిస్తున్న సేవలకు ధన్యవాదాలు.. మీరు మా హీరో’ అంటూ అభినందిస్తున్న మానవత్వమూ కనపడుతోంది.
ఎయిర్ ఇండియాకు పైలట్, కెప్టెన్ మనీష్ శర్మ.. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాలకు విమానం నడిపి అక్కడ చిక్కుకున్న కొంతమంది భారతీయులను ఇండియాకు తీసుకువచ్చారు క్షేమంగా. ఆ టాస్క్ అయిపోయాక అతను చెన్నైలోని తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండిపోయాడు. చైన్నై మునిసిపల్ సిబ్బంది వచ్చి అతని ఇంటికి క్వారంటైన్ స్టిక్కర్ అతికించి వెళ్లింది. మనీష్ సేవల గురించి తెలిసిన ఆ కాలనీ వాసులు మునిపల్ సిబ్బంది అతికించిన క్వారంటైన్ స్టిక్కర్ కిందే ‘మీరందించిన సేవలకు ధన్యవాదాలు కెప్టెన్ మనీష్..యూ ఆర్ అవర్ హీరో’ అనే అభినందనతో మరో స్టిక్కర్‌ను అతికించి తమ నైతిక మద్దతును అందించారు.
Comments
Please login to add a commentAdd a comment