నా వయసు 35. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు.ఈ శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- శారద, శ్రీకాకుళం
మీరు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆపరేషన్ అయిన మొదటి వారంలో తేలిగ్గా అరిగే ఆహారం, పండ్లు తగినన్ని తీసుకోవాలి ఆపరేషన్ జరిగిన రెండు లేదా మూడవ రోజు నుంచి డాక్టర్ సూచన మేరకు లేచి కూర్చోవడం, కొంచెం దూరం నడవడం మొదలు పెట్టాలి నెల రోజుల నుంచి చిన్నపాటి పనులు చేసుకోవడంతోపాటు క్రమంగా తిరిగి రొటీన్ వర్క్‌ను దైనందిన కార్యక్రమంలో భాగం చేసుకోవాలి
ఈ సమయంలో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్‌లు, విటమిన్లు తగుపాళ్లలో ఉన్న ఆహారం తీసుకోవాలి ఆరు వారాల వరకు బరువులు ఎత్తకపోవడం, లైంగిక జీవనానికి దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు పాటించాలి ఐరన్, క్యాల్షియం, బి-కాంప్లెక్స్ మందులు కాని డాక్టరు సూచించిన మందులను కాని వాడాలి కుట్లు మానిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. 4-6 వారాల మధ్య డాక్టర్‌ని కలిసి చెక్ అప్ చేయించుకోవాలి ఆపరేషన్ జరిగి రెండు నెలలు నిండినప్పటి నుంచి వాకింగ్, మూడు నెలల నుంచి ఎక్సర్‌సైజు మొదలు పెట్టాలి. రోజుకు కనీసం 20 - 30 నిమిషాల పాటు వ్యాయామం అవసరం.
డాక్టర్ వేనాటి శోభ
సీనియర్ గైనకాలజిస్ట్
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్
గైనిక్ కౌన్సెలింగ్
Published Mon, May 25 2015 11:23 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement