క్రికెట్ దేవుడు.. ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనూ ఘనుడు.. | Cricket .. Investments source of God .. | Sakshi
Sakshi News home page

క్రికెట్ దేవుడు.. ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనూ ఘనుడు..

Published Fri, May 2 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

Cricket .. Investments source of God ..

రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ ఇన్నింగ్స్ .. టన్నుల కొద్దీ పరుగులతో .. ఎవరికీ అందనంత ఎత్తులో రిటైరయ్యాడు సచిన్ టెండూల్కర్. విమర్శలెన్ని వచ్చినా.. ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా .. వెరవకుండా ఒక్కో అడుగు ముందుకేస్తూ ఓపికగా కెరియర్‌ని నిర్మించుకున్నాడు. కేవలం క్రికెట్‌తోనే సరిపెట్టుకోకుండా  ఇప్పుడు వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్‌గా కూడా రాణించేందుకు అదే పంథాను ఎంచుకున్నాడు. క్రికెట్ ఆడటం నుంచి మాత్రమే రిటైరయిన సచిన్ .. ట్రావెల్ పోర్టల్స్ నుంచి స్పోర్ట్స్ ఫ్రాంచైజీల దాకా వివిధ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తూ సుదీర్ఘమైన రెండో ఇన్నింగ్స్‌కు బాటలు వేసుకుంటున్నాడు. వెయ్యి కోట్ల పైగా సంపదతో అత్యంత  సంపన్న క్రీడాకారుల్లో ఒకడైన సచిన్

ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవీ.. ముసాఫిర్
దుబాయ్‌కి చెందిన ఈ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలో సచిన్‌కి ఏడున్నర శాతం మేర వాటా ఉంది. అతను దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇప్పుడిప్పుడే భారత మార్కెట్లో విస్తరించే ప్రయత్నం చేస్తోంది.
 
స్మాష్ ఎంటర్‌టైన్‌మెంట్
బ్రోకింగ్ సంస్థ షేర్‌ఖాన్ వ్యవస్థాపకుడు శ్రీపాల్ మోరాఖియాకి చెందిన ఈ సంస్థలో సచిన్‌కి 18 శాతం వాటాలు ఉన్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, రేసింగ్ లాంటి స్పోర్ట్స్ సిమ్యులేషన్ టెక్నాలజీని ఇది అందిస్తోంది.
 
ఇండియన్ సూపర్‌లీగ్ కొచ్చి ఫ్రాంచైజీ
ఇతర స్పోర్ట్స్‌ని కూడా ప్రోత్సహించే దిశగా ఫుట్‌బాల్‌కి సంబంధించి ఇండియన్ సూపర్ లీగ్‌లో కొచ్చి ఫ్రాంచైజీలో కొంత మేర సచిన్ వాటాలు తీసుకున్నాడు. సచిన్ తన చరిష్మాతో ఫుట్‌బాల్‌కి మరింత ప్రాచుర్యం, మరిన్ని నిధులు తెచ్చిపెట్టగలడని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అవడానికి క్రికెటర్ అయినా.. సచిన్‌కి టెన్నిస్ అన్నా చాలా ఇష్టం.
 
అదే ఇష్టాన్ని ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఫ్రాంచైజీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వ్యక్తపర్చాడు. ఈ టీమ్‌కి సచిన్ సహ యజమాని.
 
కలెక్టబిలియా ..
ప్రముఖులకు సంబంధించిన వస్తువులను విక్రయించే ఈ సంస్థలో టెండూల్కర్‌కి 26 శాతం వాటాలు ఉన్నాయి. ప్రముఖ క్రీడాకారులు, హాలీవుడ్ స్టార్స్, రాజకీయ నేతలు స్వదస్తూరీతో సంతకాలు చేసిన వస్తువులను కూడా ఇది విక్రయిస్తోంది.
 
ఇలా సచిన్ ఇన్వెస్ట్ చేసిన సంస్థలన్నీ దాదాపు స్టార్టప్సేకావడం గమనార్హం. ఇవన్నీ కూడా నిలదొక్కుకోవడానికి అనేక బాలారిష్టాలు అధిగమించాలి. సచిన్ తరహాలోనే ప్రతికూల పరిస్థితుల్లోనూ అవకాశాలను దొరకపుచ్చుకుని ఎదగాలి. క్రికెట్‌లోనే కాదు ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనూ సచిన్ తనదైన పంథానే పాటించడం గమనార్హం.
 
సచిన్స్.. టెండూల్కర్స్ (రెస్టారెంట్లు)
ప్రముఖ హోటలియర్ సంజయ్ నారంగ్‌తో కలసి సచిన్ తన పేరిట హోటల్స్‌ని నిర్వహిస్తున్నాడు. ముంబైలోని కొలాబా, ములుంద్‌తో పాటు బెంగళూరులో కూడా ఈ హోటల్స్ ఉన్నాయి. అత్యంత స్టయిలిష్‌గాను, పోష్‌గాను ఉండే ఈ హోటల్స్‌లో సచిన్ ఫేవరెట్ వంటకాలను కూడా అందిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement