మీకన్నా నారాయణే నయం | current political situation in a humorous outlook on the fun | Sakshi
Sakshi News home page

మీకన్నా నారాయణే నయం

Published Fri, Mar 31 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

మీకన్నా నారాయణే నయం

మీకన్నా నారాయణే నయం

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్‌ ఔట్‌లుక్‌!

గిరీశం: యామివాయ్‌ గోపాత్రుడూ... నీ దగ్గర కాపర్స్‌ ఏమన్నా ఉంటే.. పోయి మాంచి హవానా సిగార్‌ ఒకటి పట్రావోయ్‌.
గోపాత్రుడు: అలాగే గురూగోరూ. ఆలాగే గురూగోరూ. తెస్తాలే కానీ... నాకు కాస్త చదువు చెప్పండి సారూ.
గిరీశం: అదేవిటోయ్‌... అందుకే కదా నిన్ను నా దగ్గర ఉంచుకుని ఇంగ్లీషు... జింగ్లీషు... జాగ్రఫీ... గాగ్రఫీ అవీ ఇవీ నేర్పుతోంది.
గోపాత్రుడు: ఏం నేర్పుతున్నారో ఏమోనండీ. నాకు ఒక్క ముక్క వచ్చి చావలేదు. చుట్టలు కాల్చడం తప్ప నాకు ఇంకేమీ నేర్పలేదు మీరు.
గిరీశం: ఇదేనోయ్‌ నాకు ఒళ్లు మండేది. చుట్టలు కాల్చడం కూడా ఒక ఆర్టే. అది నేర్పిన కృతజ్ఞత కూడా లేదు నీకు కంట్రీ ఫెలో.
గోపాత్రుడు: తిట్టకండి ఒక్క నిముషంలో చుట్ట తెచ్చుకొని వస్తా. (గిరీశం వార్తా పత్రికలు తిరగేస్తున్నాడు)
గోపాత్రుడు: ఇదిగో గురూ గారూ చుట్ట!(గిరీశం చేతికిచ్చి అగ్గి పెట్టి వెలిగించాడు గోపాత్రుడు. చుట్ట అంటించి మనస్ఫూర్తిగా పొగ పీల్చి వదిలి తన్మయత్వంలో మునిగిపోయాడు గిరీశం)
గోపాత్రుడు: గురూ గోరూ... మీ దగ్గర నాలుగేళ్లుగా చదువుతున్నా. నాలుగేళ్ల నుంచి టెన్త్‌ క్లాస్‌ పాస్‌ అయి చావడం లేదు. ఇక ఈసారన్నా పాస్‌ కాకపోతే మానాన్న గారు నా వీపు విమానం మోత మోగిస్తారు. మీరేమో ఏమీ పట్టించుకోవడం లేదు.
గిరీశం: (పేపర్లోంచి బయట పడి) కూల్‌... కూల్‌... కంగారు పడకోయ్‌. నిన్ను సురేంద్రనాథ్‌ బెనర్జీ అంతటి వాణ్ని చేద్దామనుకుంటే నువ్వూరికే కంగారు పడతావు.
గోపాత్రుడు: బెనర్జీని చేస్తారో ఛటర్జీని చేస్తారో తెలీదు కానీ... మీ కన్నా ఆ నారాయణ గోరిని నమ్ముకున్నా బాగుండేది.
గిరీశం: డామిట్‌. ఇటీజ్‌ ఇన్‌సల్ట్‌ టు మీ. హూ ఈజ్‌ నారాయణ? నాలా అన్నీ చదువుకున్నాడా ఏంటి? (చాలా సీరియస్‌గా అడిగాడు గిరీశం)
గోపాత్రుడు: అదేమో నాకు తెలీదు కానీ... నారాయణ గారి కాలేజీలో చేరి ఉంటే చక్కగా క్వశ్చన్‌ పేపర్‌తో పాటు జవాబులు కూడా వాళ్లే రాసి ఇచ్చేవారు. నేను ఫస్ట్‌ ర్యాంక్‌లో పాస్‌ అయ్యేవాణ్ని. మిమ్మల్ని నమ్ముకుని మట్టికొట్టుకుపోయాను.
గిరీశం: ఆ నారాయణ... నారాయణ ఎవరనుకున్నావోయ్‌... మన దగ్గర చదువుకున్నోడే. మనమే నారాయణ చేత కాలేజీలు స్కూళ్లూ పెట్టించాం.
గోపాత్రుడు: మరయితే నా గురించి ఓ ముక్క చెప్దురు. ఈసారైనా నన్ను పాస్‌ చేయించారంటే మీ రుణం అట్టే పెట్టుకోను.
గిరీశం: ష్యూర్‌. నీ దగ్గర మిగిలి ఉన్న కాపర్లతో ఓ శేరు కావీ మిఠాయి తీసుకురా నేను నారాయణతో ఫైసల్‌ చేస్తా నీ సంగతి.
(గోపాత్రుడు హుషారుగా బజారులోకి పరిగెత్తాడు)
– నానాయాజీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement