సాక్షి, విజయవాడ: నారాయణ విద్యా సంస్థలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నారాయణ విద్యా సంస్థలు ద్వారా ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల వ్యక్తిగత, సున్నిత సమాచారాన్ని నారాయణ విద్యాసంస్థల సిబ్బంది సేకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్ధుల కుటుంబాల వివరాలను మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ సేకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత డేటా తీసుకోవటం ప్రజాప్రాతినిత్య చట్టం 1951, ఆర్టికల్ 19, 21 ప్రకారం నేరమంటూ పేర్కొన్నారు. విద్యా సంస్థలపై, నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరారు.
చదవండి: AP: పార్టీ ఫిరాయించారు.. వేటేనా?
Comments
Please login to add a commentAdd a comment