రామ్‌లీలా మిఠాయి | dasara sweet special | Sakshi
Sakshi News home page

రామ్‌లీలా మిఠాయి

Published Sat, Sep 30 2017 1:38 AM | Last Updated on Sat, Sep 30 2017 4:00 AM

dasara sweet special

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో రావణ దహనం తర్వాత చేసుకునే మిఠాయిల సంబరం ఇదిగో...!

మోతీచూర్‌ లడ్డు
కావలసినవి: సెనగపిండి – రెండున్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; పాలు – పావు కప్పు; మిఠాయి రంగు – చిటికెడు; నెయ్యి – డీప్‌ ఫ్రైకి తగినంత; ఏలకుల పొడి – టీ స్పూను; బాదం తరుగు – టేబుల్‌ స్పూను; పిస్తా తరుగు – టేబుల్‌ స్పూను

తయారి:  ∙పంచదారకు మూడు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చే వరకు ఉడికించి, పక్కన ఉంచాలి  పాలు జత చేసి పొంగే వరకు ఉంచి, దించేయాలి ∙మిఠాయి రంగు జత చేసి, బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగ పిండి, మూడు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. (ఇష్టపడేవారు మిఠాయి రంగు కలుపుకోవచ్చు) ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి ∙సన్న రంధ్రాలున్న చట్రంలో సెనగ పిండి పోస్తూ సన్న బూందీ నేతిలో పడేలా కదుపుతుండాలి ∙వేయించిన బూందీని బయటకు తీయాలి ∙ఈ విధంగా మొత్తం చేసుకున్నాక, పంచదార పాకంలో వేసి కలపాలి  ఏలకుల పొడి వేసి బాగా కలిపి చేతితో లడ్డు తయారుచేయాలి ∙(ముత్యం పరిమాణంలో బూందీ తయారుచేసి, లడ్డూ చేస్తాం కనుక, ఈ లడ్డూను మోతీచూర్‌ లడ్డూ అంటారు).

షీరా
కావలసినవి: పాలు – రెండున్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; రవ్వ – కప్పు; బాదం తరుగు – టేబుల్‌ స్పూను; ఎండు ద్రాక్ష – టేబుల్‌ స్పూను; నెయ్యి – అర కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు

తయారి: ముందుగా పాలు మరిగించి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి వే డయ్యాక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, బొంబాయి రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వే  పాలు పోసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ∙పంచదార వేసి మరోమారు ఉyì కించాలి ∙చివరగా బాదం తరుగు, నెయ్యి వేసి మరోమారు కలిపి దించేయాలి.

కాజూ కత్లీ
కావలసినవి: జీడిపప్పు – 3 కప్పులు; పంచదార పొడి – 10 టేబుల్‌ స్పూన్లు; పాల పొడి – టీ స్పూను; రోజ్‌ ఎసెన్స్‌ – పావు టీ స్పూను; సిల్వర్‌ ఫాయిల్‌ – చిన్న షీటు

తయారి: ∙జీడిపప్పులను తగినన్ని నీళ్లలో సుమారు గంట సేపు నానబెట్టాలి  ∙నీళ్లు ఒంపేసి, పంచదార పొడి, పాల పొడి జత చేసి, మిక్సీలో వేసి ముద్దగా చేసి తీసేయాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక, ఈ మిశ్రమం వేసి ఆపకుండా కలుపుతూ ఉడికించి, దింపేయాలి ∙తరవాత కొద్దిసేపు చేతితో మర్దించాలి ∙రోజ్‌ ఎసెన్స్‌ జత చేయాలి. ∙ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి పూసి, ఉడికిన జీడిపప్పు మిశ్రమాన్ని పళ్లెంలో పోసి, సమానంగా పరిచి, పైన సిల్వర్‌ ఫాయిల్‌ అతికించాలి. ∙కొద్దిగా గట్టిపడగానే డైమండ్‌ ఆకారంలో కట్‌ చేసుకోవాలి.

ఘేవార్‌
కావలసినవి: మైదా పిండి – 4 కప్పులు; నెయ్యి – 2 కప్పులు; పాలు – కప్పు; నీళ్లు – 4 కప్పులు; బాదం తరుగు – టేబుల్‌ స్పూను; పిస్తా తరుగు – టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి – టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; పంచదార – 2 కప్పులు; మిఠాయి రంగు – చిటికెడు

తయారి:  ∙మిక్సింగ్‌ బౌల్‌లో మైదా, నెయ్యి, పాలు, మూడు కప్పుల నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి ∙మిగిలిన ఒక కప్పు నీళ్లలో మిఠాయి రంగు వేసి బాగా కలిపి, ఈ రంగు నీళ్లను పిండిలో పోసి మృదువుగా కలుపుకోవాలి ∙స్టీలు లేదా అల్యూమినియం గిన్నెలో సగ భాగానికి నెయ్యి పోసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి ∙నెయ్యి వేడి కాగానే, కలిపి ఉంచుకున్న మైదా మిశ్రమాన్ని గ్లాసుతో పోయాలి. మధ్యలో పిండి అలాగే నిలిచి ఉండేట్లు సన్నని మంట మీద వేడి చేయాలి ∙మరో గ్లాసు పిండి తీసుకుని దాని మీదే మళ్లీ పోసి, ఈ సారి కూడా పిండి మ«ధ్యలో నిలిచి ఉండే వరకు తక్కువ మంట మీద వేడి చేయాలి ∙ఘేవర్‌ రెడీ అయినట్లే ∙మరొక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి తీగపాకం వచ్చవరకు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఘేవర్‌ను పంచదార పాకంలో ముంచి తీసి పక్కన పెట్టుకోవాలి  చల్లారాక కుంకుమ పువ్వు నీళ్లు చిలకరించాలి ∙బాదం, పిస్తా, ఏలకుల పొడి చల్లి సర్వ్‌ చేయాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement