మనసును జయించు. నీ ఆలోచనలు నీ అధీనమవుతాయి. శాంతిని జయించు. అహంకారం నీకు తల వంచుతుంది. అహంకారాన్ని జయించు, అహం నీకు అధీనమవుతుంది. అహాన్ని జయించు. భగవంతుడు నీకు వశుడవుతాడు.భగవంతుడు ఎవరికి ఎంతివ్వాలో అంతే ఇస్తాడు. మనకున్న అర్హతను బట్టే మనకు దక్కేది ఉంటుంది. మన వైఖరిని బట్టే కష్టసుఖాలు కలుగుతాయి. అంతే తప్ప వాటినెవరూ సృష్టించరు. నా లీలన్ని చదివి నీవు ఆశ్చర్యం చెందాలన్నది నా అభిమతం కాదు. వాటిని చిత్తశుద్ధితో ఆలోచించాలన్నదే నా సంకల్పం. నువ్వు చేసే ప్రతి పనికీ సాక్షీభూతుడిని నేనే.
Comments
Please login to add a commentAdd a comment