డయాబెటిస్‌ ఉన్న పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం | Diabetes is a diet to take food | Sakshi
Sakshi News home page

డయాబెటిస్‌ ఉన్న పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం

Nov 8 2017 11:51 PM | Updated on Nov 8 2017 11:51 PM

 Diabetes is a diet to take food - Sakshi

టైప్‌ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం ఇలా ఉండాలి. సమతుల ఆహారంలో తగిన పాళ్లలో పిండిపదార్థాలను (కార్బోహైడ్రేట్స్‌) సమకూర్చే కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్‌), మాంసకృత్తులు (వీటినే ప్రోటీన్లు అంటారు. ఇవి పప్పు, కోడి మాసం, వేటమాంసం, చేపలు, చీజ్, పనీర్, చిక్కుళ్ల వంటి వాటిలో ఎక్కువ) తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాలు కూడా తీసుకోవాలి. ఇందుకోసం పొద్దుతిరుగుడుపువ్వునూనె, బాదం, వాల్‌నట్‌) తీసుకోవచ్చు. ఇక వీటితో పాటు అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి.

మన భారతీయులు తీసుకునే ఆహారాల్లో పిండిపదార్థాలను సమకూర్చే వరిబియ్యం, గోధుమలు, రాగి, ఓట్స్‌ వంటివి ఎక్కువ. వాటి ద్వారా ఒంటికి వెంటనే శక్తి సమకూరుతుంది. అంతేకాదు... వాటి వల్ల పిల్లల రక్తంలో చక్కెరపాళ్లు పెరుగుతాయి. అందుకే పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్ల)ను ఇచ్చే ఆహారం విషయంలో కొన్ని పరిమితులు పాటించాల్సి ఉంటుంది. పిల్లల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకొని న్యూట్రీషనిస్టులు వారికి డైట్‌ ప్లాన్‌ చెబుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement