అంతరిక్షంలో ఆపరేషన్‌ శక్తి | DRV Balakrishna Reddy Article On Space Operation Shakti | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో ఆపరేషన్‌ శక్తి

Published Sun, Apr 7 2019 12:53 AM | Last Updated on Sun, Apr 7 2019 12:53 AM

DRV Balakrishna Reddy Article On Space Operation Shakti - Sakshi

శత్రుదేశాల ఉపగ్రహాలను ఆకాశంలోనే పేల్చివేయగలిగిన క్షిపణిని భారత్‌ తన దేశీయ పరిజ్ఞానంతోటే డీఆర్‌డీఓ నేతృత్వంలో ప్రయోగించి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది. భూమికి సమీపంలో అంటే 300 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని కేవలం మూడు నిమిషాల వ్యవధిలో భూమ్మీద నుంచి ప్రయోగించి కూల్చడం ఏరకంగా చూసినా మన శాస్త్రవేత్తలకు చారిత్రాత్మక విజయం అనే చెప్పాలి. ప్రతిపాదన వచ్చినవెంటనే ఆమోదముద్ర తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ ఆరంభంలోనే సగం విజయాన్ని ఖాయం చేశారు. అంతరిక్షంలో మిషన్‌శక్తి వంటి ప్రయోగాల ద్వారా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అందరికీ అర్థమవుతోంది.

భారతదేశం ‘ఆపరేషన్‌ శక్తి’ పేరిట అంతరిక్ష ఉప గ్రహ, క్షిపణి ప్రయోగాల్లో చరిత్రాత్మక ఘనవిజ యాన్ని సాధించడం ప్రశం సనీయం. గత కొన్నేళ్లుగా మన శాస్త్రవేత్తలు అహర్ని శలు సల్పుతున్న కృషి ఫలి తమే ఈ ఘనవిజయానికి కారణం. శత్రుదేశాల ఉపగ్రహాలను ఆకాశంలోనే పేల్చివేయగలిగిన క్షిపణిని భారత్‌ తన దేశీయ పరిజ్ఞానంతోటే డీఆర్‌డీఓ నేతృత్వంలో ప్రయోగించి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది. భూమికి సమీపంలో అంటే 300 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని కేవలం మూడు నిమిషాల వ్యవధిలో భూమ్మీద నుంచి ప్రయోగించి కూల్చడం ఏరకంగా చూసినా మన శాస్త్రవేత్తలకు చరిత్రాత్మక విజయం అనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంతరిక్షంలో మిషన్‌శక్తి వంటి ప్రయోగాల ద్వారా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అందరికీ అర్థమవుతోంది.

ఈ క్షిపణి ప్రయోగ చర్యను దేశభద్రతను పెంపొందించడం కోసం, ప్రపంచ శాంతి ప్రయోజ నాల నిమిత్తం నిర్వహించడమైనది. ఈ ప్రయోగం కోసం గత కొన్నేళ్లుగా భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం, నిధుల కోసం ప్రయత్నించారు. ప్రతిపాదన వచ్చిన వెంటనే భారత ప్రధాని నరేంద్రమోదీ మంజూరు చేసి శాస్త్రవేత్తల వెన్నుతట్టినప్పుడే సగం విజయం చేకూరింది. ప్రయో గం విజయవంతం అయ్యాక దాన్ని భారత శాస్త్రవే త్తల చరిత్రాత్మక ఘనవిజయంగా ప్రధాని మోదీ వర్ణించి అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగాములైన అమె రికా, రష్యా, చైనాల సరసన నాలుగో స్థానంలో భార త్‌ను నిలపడంపట్ల మన శాస్త్రజ్ఞులను కొనియాడారు.

అంగారక గ్రహంపై ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన అమెరికా, రష్యా, యూరోపియన్‌ దేశాలతో పోటీ పడుతూ భారత్‌ మంగళయాన్‌ పేరిట 2013 నవం బర్‌ 5న అంగారకుడిపైకి తన తొలి ఉపగ్రహాన్ని పంపించింది. ప్రపంచ దేశాల దృష్టిని ఆనాడే దేశం ఆకర్షించింది. రెండేళ్ల కిందట 2017 ఫిబ్రవరి 14న రష్యా రికార్డును బద్దలు చేసిన భారత్‌ ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2014లో ఒకేసారి 37 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన రష్యా రికార్డును అధిగమించి భారత్‌ 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపడం సాధారణ విషయం కాదు. ఇది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేస్తున్న అవిరామ కృషి.
ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనా రంగంలో మొదటి ఐదు దేశాల్లో భారత్‌ ఉంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్‌ అపారమైన జ్ఞానం, అనుభవం సంతరించుకుని ఉంది. ఉపగ్రహాలను స్వంతంగా అంతరిక్ష కక్ష్యలోకి పంపించే ప్రత్యేక సభ్యదేశాల జాబితాల్లో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది.

భారత్‌ అంతరిక్ష ప్రయోగాల్లో సాధిస్తున్న వరుస ఘన విజయాలు ఈ రంగంలో దేశీయంగా విస్తృత అధ్యయ నాలు, పరిశోధనలను ప్రోత్సహి స్తున్నాయి. ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్ష పరిశో ధనలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీ యం గానే అంతరిక్ష న్యాయ శాస్త్రంపై చర్చలు, సమీక్షలు విస్తృతంగా జరుగుతున్నాయి. అంతరిక్ష భద్రత, రక్షణ పరమైన అంశాలకు ఎనలేని ప్రాధాన్యత లభిస్తోంది. అంతరిక్షం అగ్రరాజ్యాలు, అగ్రదేశాలు మాత్రమే ఉపయోగించుకునేది కాదు. ప్రపంచదేశాల న్నింటికీ అంతరిక్షంపై సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉన్నాయి. దాదాపు 60 దేశాలు అంతరి క్షంలో ఉపగ్రహాలను ప్రయోగించి ఉపయోగించు కుంటున్నాయి. రానున్న రోజుల్లో అంతరిక్షంలో రద్దీ, పోటీ వాతావరణం పెరిగే అవకాశం ఉంది.

అంతర్జాతీయ అంతరిక్ష న్యాయశాస్త్రం ముఖ్యంగా 5 బహుపాక్షిక ఒప్పందాలపై ఆధారపడి ఉంది. 1. అంతరిక్ష ఒడంబడిక 1967. 2. రెస్క్యూ ఒప్పందం 1968. 3. బాధ్యతాయుత ఒడంబడిక 1972. 4. రిజిస్ట్రేషన్‌ ఒడంబడిక 1975. 5. చంద్రు డిపై ఒడంబడిక 1979. ఈ ఐదు అంతర్జాతీయ, అంతరిక్ష ఒప్పందాల ముఖ్య ఉద్దేశాలు మానవాళికి హితం చేకూర్చేవి. అవేమిటంటే.. ఏ దేశం కూడా అంతరిక్షాన్ని దుర్వినియోగపర్చరాదు. అంతరిక్షంలో ఆయు ధాల నిషేధం లేదా నియంత్రణ. అంతరిక్షంలో స్వేచ్ఛ, అన్వేషణలు సాగించటం. అంతరిక్షంలోని సంబంధిత వస్తువులను నష్టపరిస్తే బాధ్యులను చేయటం. అంతరిక్షంలో భ్రమిస్తున్న లేక సంచరి స్తున్న వ్యోమ నౌకలను, వ్యోమగాములను భద్రత మరియు రక్షించటం. అంతరిక్షంలోకి సహజ వన రుల అన్వేషణ. ప్రతి ఒడంబడిక ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ సహాయ సహకారాలతో అంతరిక్షంలో సురక్షితమైన కార్యకలా పాలను నిర్వహించుకోవటం.

రోజురోజుకూ పెరుగుతున్న అంతరిక్ష ఉపగ్రహ ప్రవేశాల కారణంగా కొంత పర్యావరణ కాలుష్యం జరుగుతున్న మాట వాస్తవం. గ్రహ శకలాలు భూమి పైకి పడటం ద్వారా లేదా అంతరిక్షంలో నిరుపయో గంగా ఉన్న ఉపగ్రహాలను తొలగించుటకు, అక్కడి వ్యర్థాలను నిర్మూలించటం కొరకు, అదే విధంగా ప్రపంచ పర్యావరణ హితం కొరకు భారత్‌ కోఆపరే టివ్‌ స్పేస్‌ మిషన్‌ను ప్రతిపాదించి ప్రవేశపెట్టడం జరిగింది. భారత్‌ అదే విధంగా అంతర్జాతీయ, అంత రిక్ష న్యాయశాస్త్రంపై, దాని విధానపరమైన అంశా లపై  విస్తృతమైన అధ్యయనం చేసి తనదైన పాత్రను పోషించింది. భారత్‌కు అన్ని ముఖ్యమైన అంతరిక్ష ఒడంబడికలలో సభ్యత్వం ఉంది..

అభివృద్ధి చెందుతున్న దేశాల సహాయ సహ కారాలు అంతరిక్ష రంగంలో చాలా అవసరం అని భారత్‌ భావిస్తుంది. అంతరిక్షంలోని ప్రయోజ నాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందకపోతే అంత రిక్ష అభివృద్ధి కార్యకలాపాలు నిరర్థకం అయినట్టే. జాతి గర్వించదగ్గ విజయాలను భారత్‌ చేకూ రుస్తూ, అంతరిక్ష సాంకేతిక రంగంలో ముందడుగు వేస్తూ, ప్రపంచ దేశాలకు తనదైన చర్యలతో మార్గద ర్శిగా నిలుస్తూ, తన ప్రత్యేకతను చాటుకోవటం విశేషం. అంతరిక్ష కార్యకలాపాలు భారత్‌లోనే కాక ఇతర దేశాలలో కూడా దినదిన ప్రవర్ధమానమై కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటివరకు భారత్‌లో అంతరిక్షానికి సంబంధించిన చట్టం లేకపోవడం బాధాకరం. ప్రస్తుత సమాజంలో త్వరితగతిన సంభ విస్తున్న శాస్త్ర, సాంకేతిక వినియోగాన్ని గమనించి నట్లయితే∙పటిష్టమైన జాతీయ అంతరిక్ష న్యాయ చట్టం ఆవశ్యకత ఎంతగానో ఉన్నది.

గత ఏడు దశాబ్దాలుగా భారత్‌ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలు అద్భుతం.  ‘ఆప రేషన్‌ శక్తి’ ద్వారా భారత్‌ సొంత సాంకేతిక పరి జ్ఞానంతో ప్రపంచాన్ని అబ్బుర పర్చడమే గాకుండా, దేశీయ వ్యాపార వాణిజ్య అవసరాలను తీర్చే దిశగా  విజయం సాధించింది. ఇవి విస్తృతమవుతున్నందు వల్ల మనకు జాతీయ అంతరిక్ష చట్టం అవసరం. అంతరిక్ష టెక్నాలజీ వినియోగంలో భారీ నిధులు, ఈ కార్యకలాపాలలో ప్రైవేటు వ్యక్తుల, దేశ ప్రజల నిధులు, ప్రయోజనాలు కూడా ఉన్నందున రాబోయే రోజులలో కొన్ని సమస్యలు, చిక్కులు న్యాయప రంగా వచ్చే అవకాశం ఉన్నది. మారుతున్న కాలానికి తగినట్లుగా జాతీయ చట్ట ముసాయిదాను ప్రతిపాది స్తున్నారు. ఈ చట్టం ఆవశ్యకత, జాతీయ, అంతర్జా తీయ ప్రయోజనాలను చక్కగా నిర్వర్తించ గలదు.

ప్రొ‘‘ డీఆర్వీ బాలకిష్టారెడ్డి
వ్యాసకర్త రిజిస్ట్రార్, సెంటర్‌ హెడ్‌ ఫర్‌ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ లాస్,
నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement