రారండోయ్‌ | Events In Hyderabad | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, May 7 2018 1:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Events In Hyderabad


  • 24 మంది కథకుల ‘కొత్త కథ –2018’ ఆవిష్కరణ మే 13న ఉదయం 10:45కు  తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో జరగనుంది. నిర్వహణ: రైటర్స్‌ మీట్‌ ప్రచురణలు. సంపాదకులు: కుప్పిలి పద్మ, వెంకట్‌ సిద్ధారెడ్డి.

  • బోయ జంగయ్య ద్వితీయ వర్ధంతి సభ మే 7న సాయంత్రం 5 గంటలకు నల్లగొండలోని పెన్షనర్స్‌ భవన్‌లో జరగనుంది.

  • ఆలపర్తి పిచ్చయ్య చౌదరి ‘గండికోట రహస్యం’ ఆవిష్కరణ మే 7న సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని హోటల్‌ ఐలాపురంలో జరగనుంది. 

  • తెలంగాణ సాహితీ వారి ‘లిటెరరీ ఫెస్ట్‌ – 2018’ తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో మే 10, 11, 12 తేదీల్లో జరగనుంది. వివరాలకు: 9393804472

  • ‘కావ్య పరిమళం–2’లో రంగనాథ రామాయణంపై కసిరెడ్డి వెంకటరెడ్డి మే 11న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి మినీ హాల్‌లో ప్రసంగిస్తారు. నిర్వహణ: తెలంగాణ సాహిత్య అకాడమి.

  • ‘బహుళ’ (సాహిత్య విమర్శ) ఆవిష్కరణ మే 12న సాయంత్రం 6 గం.కు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో జరగనుంది. ఆవిష్కర్త: కె.శ్రీనివాస్‌. నిర్వహణ: పర్‌స్పెక్టివ్స్‌.

  • రైలు కథలు పరిచయ సభ మే 13న ఉదయం 10 గంటలకు సీతారామ నగర్‌ ప్రజా సంక్షేమ సంఘం, చెన్నైలో జరగనుంది. నిర్వహణ: జనని, చెన్నై.

  • ఇంద్రగంటి జానకీబాల, మన్నెం శారద, బి.విజయ భారతి, కె.వరలక్ష్మి, డి.సుజాతాదేవి, తిరునగరి జానకీదేవి, ఎస్‌.ఉమాదేవి, సమ్మెట ఉమాదేవి, దీపికా రెడ్డి, పాటిబండ్ల రజని, మమతా రఘువీర్, స్వప్నకు ‘అమృతలత–అపురూప అవార్డ్స్‌ 2018’ ప్రదానం మే 13న సాయంత్రం 4:45కు తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనుంది. 
  • తాళ్లపల్లి మురళీధర గౌడ్‌ సాహితీ స్వర్ణోత్సవ సభ మే 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరగనుంది. నిర్వహణ: సత్కళా భారతి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement