కళ్లలోనే నీటికాసులకు చికిత్స | eyes treatment | Sakshi

కళ్లలోనే నీటికాసులకు చికిత్స

Nov 27 2017 1:15 AM | Updated on Nov 27 2017 1:15 AM

eyes treatment - Sakshi

వయసుతో పాటు కళ్లకు వచ్చే వ్యాధి నీటికాసులకు మరో వినూత్నమైన చికిత్సను సిద్ధం చేశారు కాలిఫోర్నియా యూనివర్శిటీ (శాన్‌ఫ్రాన్సిస్కో) శాస్త్రవేత్త తేజల్‌ దేశాయి! ప్రస్తుతానికి ఈ వ్యాధికి చుక్కల మందు ఒక్కటే చికిత్స. వ్యాధిని తొందరగా గుర్తించి.. రోజుకు మూడు సార్లు చుక్కల మందు వేసుకుంటే శాశ్వత అంధత్వం రాకుండా నివారించవచ్చు.

అయితే క్రమం తప్పకుండా మందు వేసుకోవడం ఒక సమస్యకాగా.. వేసుకున్న మందులో ఎక్కువభాగం రక్తంలో కలిసిపోవడం వల్ల వ్యాధి నయమమ్యేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తేజల్‌ దేశాయి ఓ వినూత్న పరికరం ద్వారా నీటికాసులకు నేరుగా మందు అందించడంలో విజయం సాధించారు. రెండు పొరల బయోఫిల్మ్‌ మధ్యలో చుక్కల మందును ఏర్పాటు చేయడం.. దాన్ని కంట్లో ఉంచినప్పుడు నెమ్మదిగా మందు విడుదల కావడం ఈ వినూత్న పరికరం తాలూకూ ముఖ్య లక్షణాలు.

ఈ పరికరాన్ని ఇప్పటికే జంతువులపై ప్రయోగించి చూశామని, దాదాపు 24 వారాల పాటు పరిశీలించిన తరువాత ఇది బాగానే పనిచేస్తున్నట్లు గుర్తించామని తేజల్‌ దేశాయి వివరించారు. మరింత పెద్ద స్థాయిలో జంతు పరీక్షలు జరిపిన తరువాత ఈ పరికరాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement