ఈ ఫ్యాషన్ షోలను చూస్తూ ఉంటారా? అదేనండీ, ర్యాంప్ వాక్‌లు గట్రా. ఆ ర్యాంప్ మీద నడవాలంటే చాలా ట్రైనింగ్ ఉంటుంది. కాలు ముందు కాలెయ్యాలి. చేతులు ఓ లాగా ఊపాలి. భుజం ఓ లాగా తిప్పాలి. నడుము మరోలా ఊపాలి. మొన్నెప్పుడో రాణీ ముఖర్జీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిందట. అది ఎయిర్‌పోర్ట్‌లా అనిపించలేదు! ర్యాంప్ వాక్ ఫ్యాషన్ షోలా కనిపించిందట. దుస్తులు, బూట్లు, పర్సులు, హెయిర్ స్టయిల్, కళ్లద్దాలు, హ్యాంగింగ్స్, ఇన్‌క్లూడింగ్.. ట్రావెల్ బ్యాగ్.. ఒక స్టయిల్లో ఉంటేనే సెలబ్రిటీలు ఎయిర్‌పోర్ట్‌లోకి వస్తారట. ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో ఆ ఎయిర్‌పోర్ట్ ర్యాంప్‌ను గుర్తు చేసుకుంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వి చైర్‌లోంచి కింద పడిపోయింది రాణీ ముఖర్జీ. అంత గమ్మత్తుగా అనిపించిందట.
ఏం చేస్తార్లే పాపం.. ఈ రోజుల్లో సెలబ్రిటీలను ప్రతి విషయానికీ జడ్జ్ చేసేస్తుంటారు. సింపుల్ బట్టలు వేసుకుంటే యూజ్‌లెస్ ఫెలో అంటారేమోనని.. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడానికి ఏ బట్టలు వేసుకోవాలి అన్నది చెప్పడానికి ఒక ఫ్యాషన్ డిజైనర్‌ని పెట్టుకుంటున్నారంటూ, మరోసారి నవ్వుతూ చైర్‌లోంచి కింద పడింది రాణీ ముఖర్జీ. ‘ఒకప్పుడు ఎయిర్‌పోర్ట్‌కెళితే సెక్యూరిటీ చెక్‌ల ఇబ్బంది తప్పించుకోవడం కోసం ఒక ట్రాక్ సూట్, ఒక జత చెప్పులు, సింపుల్ హ్యాండ్‌బ్యాగ్ తగిలించుకుని వెళ్లేవాళ్లం. కంఫర్టబుల్‌గా ఉండేది. ఇప్పుడు బెల్టు తియ్యమంటాడు. షూ తియ్యమంటాడు. బ్యాగు తిప్పెయ్యమంటాడు. జుట్టు క్లిప్పు తియ్యమంటాడు. అయినా.. ఎవరు ఎలా జడ్జ్ చేస్తారో అన్న టెన్షన్‌లో ఎయిర్‌పోర్ట్‌లో ర్యాంప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు’ అనంటూ మళ్లీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ చైర్‌లోంచి కింద పడిందట.
ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాషన్ షోనా?!
Published Mon, Dec 4 2017 11:37 PM | Last Updated on Tue, Dec 5 2017 2:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment