
టర్కీలోని ఇస్తాంబుల్ సిటీలో ఒక ప్యాసింజర్ బస్ డ్రైవర్‌కి శిక్ష పడింది. రద్దీగా ఉండే హైవేలో డ్రైవ్ చేస్తూ చేస్తూ, సడెన్‌గా స్టీరింగ్ వదిలేసి, సీట్లోంచి పైకి లేచి ఓ హుషారైన పాటకు డాన్స్ చేస్తూ ప్రయాణికులను ఎంటర్‌టైన్ చెయ్యడమే అతడు చేసిన నేరం. ఈ వినోదాన్ని బిక్కుబిక్కుమంటూ రికార్డ్ చేసిన ఓ ప్యాసింజర్.. వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చెయ్యడంతో విషయం బయటికి వచ్చింది.
శిక్ష విధించిన అధికారులు ఈ డ్రైవర్‌ను స్టుపిడ్ అంటున్నారు కానీ అతడి పేరు మెటిన్ కెండెమిర్. డ్రైవింగ్ లైసెన్స్ లాక్కుని, 160 లిరాల జరిమానా విధించారు. మన ఇండియన్ కరెన్సీలో 2,750 రూపాయలు. ‘‘తప్పు జరిగిపోయింది. సారీ, ఇంకెప్పుడూ అలా చేయను. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని అలా చేశాను’’ అని చెంపలేసుకుంటున్నాడు కెండెమిర్.
Comments
Please login to add a commentAdd a comment